90 నిమిషాలు అడ్డుగోడలా.. రోమాలు నిక్కబొడిచే ప్రదర్శన!
ఫిఫా ప్రపంచకప్‌లో చాలా మ్యాచ్‌లు వన్‌సైడ్‌గా ముగుస్తున్నాయని ఫుట్‌బాల్ అభిమానుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈసారి ఫిఫా అంత కిక్ ఇవ్వడం లేదని కూడా కొందరు వాపోతున్నారు. కానీ అది తప్పని మరోసారి నిరూపితమైంది. చాలా మ్యాచ్‌లు డ్రాగా ముగుస్తున్నప్పటికీ, పెద్ద జట్లను నిలువరిస్తూ చిన్న జట్లే ఈసారి ఫిఫాలో హైలైట్‌గా మారిపోయాయి. కేప్ వర్డె, కురాకావో వంటి చిన్న దేశాలు టోర్నీలో తమ పోరాటంతో ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ దేశాలు తమ మ్యాచ్‌లను డ్రా చేసుకోవడంలో గోల్ కీపర్లదే కీలకపాత్ర. 40 ఏళ్ల వోజిన్హా (కేప్ వర్డె), 37 ఏళ్ల ఎలోయ్ రూమ్ (కురాకావో) అద్భుత గోల్‌కీపింగ్ విన్యాసాలతో పెద్ద జట్లను నిలువరించి తమ జట్లకు డ్రా రూపంలోనే విజయాలు సాధించి పెట్టారు. తాజాగా వీరి సరసన ఇరాన్ గోల్ కీపర్ అలీరెజా బెయిరాన్వాండ్కు కూడా చోటు కల్పించాల్సిందే.ఫిఫా ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం గ్రూప్-జీలో ఫిఫా 9వ ర్యాంకర్ బెల్జియంను ఇరాన్ నిలువరించిందంటే అదంతా అలీరెజా చలువే. మ్యాచ్‌లో బెల్జియం ఒక్క గోల్ కూడా కొట్టకపోవడంలో అలీరెజాదే కీలకపాత్ర. ఇరాన్ గోల్‌పోస్ట్ వద్ద అడ్డుగోడలా నిలబడిన అలీరెజా బెల్జియం పటిష్టమైన డిఫెన్స్‌ను సమర్థంగా ఎదుర్కొని గోడకు కొట్టిన బంతిలా నిలబడ్డాడు. మ్యాచ్‌లో ఏడుసార్లు గోల్ చేసే అవకాశం వచ్చినప్పటికీ ఆరు అడుగులు నాలుగు అంగుళాల పొడవున్న అలీరెజా బెయిరాన్‌వాండ్ తన రెండు చేతులను చాపి బంతిని తన ఆధీనంలో ఉంచుకున్నాడు. మొత్తం ఏడు సేవ్స్ చేసిన అలీరెజానే ‘ఫిఫా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు’ కూడా వరించింది.అంతేకాదు, క్రీడా నియమాల ప్రకారం ఒక క్లీన్షీట్ను కూడా అలీరెజా సొంతం చేసుకున్నాడు.గొర్రెలకాపరి కుటుంబం నుంచి..అలీరెజా గొర్రెల కాపరి కుటుంబం నుంచి వచ్చాడు. అలీరెజా 12 ఏళ్ల వయసులో యూరోప్ ఉన్నత వర్గాల ఆధిపత్య పోరుకు తట్టుకోలేక అతడి తల్లిదండ్రులు బీరన్వంద్ నుంచి లోరెస్తాన్ కొండల్లోకి పారిపోయారు. ఆ కొండల్లోనే తీవ్ర పేదరికంలో అలీరెజా బాల్యం గడిచింది.చిన్నప్పటి నుంచే ఫుట్‌బాల్ ఆటపై అమితాసక్తి పెంచుకున్న అలీరెజా ఈ విషయంలో ప్రతీరోజు తండ్రితో గొడవపడేవాడు. ఎలాగోలా ఇంట్లో వాళ్లను ఒప్పించి ఆ కొండ ప్రాంతం నుంచి ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు చేరుకున్నాడు. టెహ్రాన్ చేరుకున్న సమంలో అలీరెజా జేబులో రూపాయి లేదు. నెలల తరబడి, అతడు స్థానిక ఫుట్‌బాల్ క్లబ్‌ల బయటే ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ కాలం గడిపాడు. ఆ క్లబ్లో జరిగే మ్యాచ్‌లను చూస్తూ ఫుట్‌బాల్ ఆటను పూర్తిగా అవగతం చేసుకున్నాడు. కొన్నాళ్లకు ఒక ఫ్యాక్టరీలో అసెంబ్లింగ్ పనులు చేస్తూ స్థానిక ఫుట్‌బాల్ క్లబ్లో మెంబర్షిప్ సాధించాడు. ఆ క్లబ్‌కు డబ్బులు కట్టడం కోసం రాత్రిళ్లు పిజ్జా దుకాణాల్లో పిండిని కలపడం, పిజ్జాలు చేయడం వంటి పనులు కూడా చేశాడు. అయితే కొండ ప్రాంతం నుంచి రావడంతో అలీరెజా బలిష్టంగా ఉండడంతో అతడికి గోల్ కీపింగ్ కరెక్ట్ అని స్థానిక ఫుట్‌బాల్ క్లబ్ కోచ్ నిర్ణయించాడు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ ఇరాన్ ఫుట్‌బాల్ జట్టుకు గోల్‌కీపర్‌గా సేవలందిస్తున్నాడు అలీరెజా. రెండు గిన్నిస్ రికార్డులు..ఇక మోడ్రన్ ఫుట్‌బాల్‌లో అలీరెజా బెయిరాన్‌వాండ్ తన పేరిట రెండు గిన్నిస్ రికార్డులు కూడా లిఖించుకున్నాడు. 2016 అక్టోబర్‌లో దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్‌లో బంతిని దాదాపు 200.14 అడుగులు (61.002 మీటర్లు) విసిరి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఫుట్‌బాల్ చరిత్రలో అత్యంత సదూర త్రో రికార్డు ఇప్పటికీ అలీరెజా పేరిటే ఉంది. ఇక ఫుట్‌బాల్‌లో అత్యంత పొడవైన డ్రాప్ కిక్ (255.95 అడుగులు-78.014 మీటర్లు) కూడా అలీరెజాదే కావడం విశేషం. ఇక బెల్జియం, న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లను డ్రా చేసుకున్న ఇరాన్ రెండు పాయింట్లు సాధించి నాకౌట్ అర్హత అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఇరాన్ తన తర్వాతి మ్యాచ్ జూన్ 27న పటిష్టమైన ఈజిప్ట్‌తో ఆడనుంది. Alireza Beiranvand🧤💚 pic.twitter.com/HlVeDsHoXo— Iman🇵🇹🇫🇷 (@i4emi) June 21, 2026Read: సౌతాఫ్రికా చేతిలో ఓటమి.. భారత్ సెమీస్ చేరాలంటే!