breaking news
alay balai
-
ఇలా సత్కారం చేయడం కొత్తగా అనిపించింది: నాగార్జున
హైదరాబాద్‌లో ప్రతీ ఏడాది నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో చాలామంది సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. దసరా మరుసటిరోజున ప్రతి ఏటా ఈ కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాగార్జున, బ్రహ్మానందం పలు వ్యాఖ్యలు చేశారు.కులమతాలకు అతీతంగా, పార్టీలు, సిద్ధాంతాలు, భావజాల సంఘర్షణలను పక్కన పెట్టి ‘మనమంతా ఒక్కటే’ననే సమైక్యత భావన స్ఫూర్తిని అందజేసే పండుగలా ఈ వేడుక జరుగుతుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయ నాయకుల మధ్య ఐక్యత కోసం సుమారు 20 ఏళ్ల క్రితం దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. అతిథులకు వడ్డించేందుకు 85 రకాల తెలంగాణ ప్రత్యేక వంటకాలను సిద్ధం చేశారు. వెజ్, నాన్ వెజ్ వంటలతో పాటు వివిధ రకాల పిండివంటలు, స్వీట్లు రెడీ చేశారు.సపోర్ట్‌గా నిలబడతారనే నమ్మకం కలిగింది: నాగార్జునఅలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొన్నవారందరికీ దత్తాత్రేయ కండువాలు వేసి స్వాగతం పలికారు. ఈ క్రమంలో అక్కినేని నాగార్జున పలు వ్యాఖ్యలు చేశారు. ఇలా అన్ని వర్గాల వారిని సత్కారం చేయడం కొత్తగా అనిపించిందని ఆయన చెప్పారు. పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలంతా ఒకే వేదికపై రావడం అందరిలో కాన్ఫిడెన్స్ పెంచిందని తెలిపారు. ఏదైనా ఇష్యూ వస్తే సపోర్ట్‌గా నిలబడతారని నమ్మకం కుదిరిందని నాగార్జున్ చెప్పుకొచ్చారు. ఇదే కార్యక్రమంలో పాల్గగొన్న బ్రహ్మానందం ఇలా అన్నారు. 'అలయ్ బలయ్ ఆలింగనం చేసుకునే కార్యక్రమం. శ్రీరామ చంద్రుడు హనుమంతుడిని ఆలింగనం చేసుకున్నారు. అప్పటి నుంచి అలయ్ బలయ్ ఉంది. శాంతి నశిస్తున్న కాలంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం.' అని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, సీపీఐ నేత నారాయణ, ప్రొఫెసర్ కోదండరామ్, అక్కినేని నాగార్జున, బ్రహ్మానందం, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మందకృష్ణ మాదిగ వంటి ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
చిరంజీవి ఫ్యాన్స్ దెబ్బకి దిగివచ్చిన గరికపాటి
-
గరికపాటి వ్యాఖ్యలపై స్పందించిన నాగబాబు.. ఏమన్నారంటే?
ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావుపై వ్యాఖ్యలపై నాగబాబు వ్యంగ్యంగా స్పందించారు. 'ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే' అంటూ ఆయన ట్వీట్ చేశారు. దసరా పండుగ నేపథ్యంలో హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ఏర్పాటు చేసిన అలయ్ బలయ్ వేడుకలో జరిగిన సంఘటనపై ఆయన ఈ విధంగా కౌంటరిచ్చినట్లు తెలుస్తోంది. (చదవండి: గరికపాటికి క్షమాపణలు చెప్పిన చిరంజీవి) అసలేం జరిగిందంటే: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన అలయ్ బలయ్ వేడుకలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో అభిమానులు చిరంజీవితో ఫోటో సెషన్ నిర్వహించారు. మెగాస్టార్‌తో సెల్ఫీలకు జనం ఎగబడటంతో గరికపాటి ప్రసంగానికి అంతరాయం ఏర్పడింది. దీంతో సెల్ఫీలు ఆపితేనే ప్రసంగాన్ని కొనసాగిస్తానని గరికపాటి అసహనం వ్యక్తం చేశారు. ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే .. — Naga Babu Konidela (@NagaBabuOffl) October 6, 2022 -
దుబ్బాక అభివృద్ధి బాధ్యత నాది: హరీశ్ రావు
సాక్షి, సిద్దిపేట: దసరా సందర్భంగా సోమవారం దుబ్బాక ఆర్యవైశ్య సంఘం వారు అలాయ్ బలాయ్ కార్యక్రమం నిర్వహించారు. ఆర్శవైశ్య భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. దుబ్బాకకు ఇప్పుడు వచ్చే వారు కేవలం ఓట్ల కోసమే వస్తున్నారు. ఉత్తమ్‌కు దుబ్బాక ఎలా ఉంటదో తెలియదు. మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క సారి దుబ్బాకకు రాలేదు. హుజూర్ నగర్లో టీఆర్ఎస్ గెలిస్తే ఏమొస్తది అని ఉత్తమ్ అన్నారు. కానీ మేం గెలిచాక.... కేసీఆర్ ఆ నియోజకవర్గానికి వెళ్లి 300 కోట్ల రూపాయల పనులు మంజూరు చేశారు. రేపు దుబ్బాక కూడా అదే రీతిలో అభివృద్ధి అవుతుంది. దుబ్బాక అభివృద్ధి బాధ్యత నాదే.. అనుమానం అవసరం లేదు. సుజాతక్క నా తోబుట్టువు. నేను జిల్లా మంత్రిని. కేసీఆర్ ఆశీస్తులతో దుబ్బాకను అభివృద్ధి చేస్తా’ అని స్పష్టం చేశారు హరీశ్ రావు. (చదవండి: ‘కేసీఆర్‌ను ఓడిస్తేనే అన్ని అమలు అవుతాయి’) ‘సీఎం ఆశీస్సులతో నారాయణ ఖేడ్‌ను నేను అభివృద్ధి చేశాను. 200 వందల కోట్ల రూపాయలు పైగా ఖర్చు పెట్టి రోడ్లు వేయించా. ఎన్నికల వరకే కాంగ్రెస్, బీజేపీ నేతలు ఉంటారు. ఆ తర్వాత కూడా నేను, సూజాతక్క ఉంటాము. ఓసీ పేదలకు సహాయం అందుతుందంటే అదీ తెలంగాణ రాష్ట్రంలోనే... దేశంలో ఈ విధానం ఎక్కడా లేదు. ఆర్య వైశ్య కార్పోరేషన్‌ను తప్పకుండా ఏర్పాటు చేస్తాం’ అన్నారు హరీశ్ రావు. -
అలయ్..భళాయ్..