breaking news
agreed
-
ట్రంప్ ప్రణాళికపై హమాస్ కీలక నిర్ణయం.. బందీల అప్పగింతకు మొగ్గు
గాజా: గాజాలో యుద్ధానికి శాశ్వత పరిష్కారం చూపే దిశగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన ఇరవై సూత్రాల శాంతి ప్రణాళికపై హమాస్ కీలక నిర్ణయం తీసుకుంది. ట్రంప్ విధించిన గడువులోగా ఇజ్రాయెల్ బందీలందరినీ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు హమాస్ ప్రకటించింది. గాజాలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికి, పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు ట్రంప్ ఈ ప్రణాళికను ప్రకటించారు.నరకం తప్పదన్న ట్రంప్ హెచ్చరికలతో..దీనిలోని నిబంధనల ప్రకారం హమాస్ తన ఆధీనంలో ఉన్న బందీలను 72 గంటల్లోగా విడుదల చేయాల్సి ఉంటుంది. ఆయుధాలను విడిచిపెట్టి, పరిపాలన నుంచి తప్పుకోవాలని ప్రధానంగా ట్రంప్ సూచించారు. దీనిపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇప్పటికే అంగీకారం తెలిపారు. కాగా ఈ ప్రణాళికను అంగీకరించని పక్షంలో నరకం తప్పదని ట్రంప్ ఇప్పటికే హమాస్‌ను తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఈ నేపథ్యంలో హమాస్.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన నిబంధనలకు తలొగ్గింది. బందీల విడుదల విషయంలో మధ్యవర్తులతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఇదేవిధంగా గాజా పరిపాలనను స్వతంత్ర టెక్నోక్రాట్ పాలస్తీనా సంస్థకు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా ప్రకటించింది. అయితే ఈ ప్రణాళికలోని పలు అంశాలపై పాలస్తీనా వర్గాలతో సంప్రదింపులు అవసరమని తెలిపింది. President Donald J. Trump shares a powerful message in response to Hamas' statement regarding his peace plan: "Very importantly, I look forward to having the hostages come home." pic.twitter.com/RZArVNcXc9— The White House (@WhiteHouse) October 3, 2025ట్రంప్ ప్రణాళిక మొదటి దశ అమలుమరోవైపు ట్రంప్ ప్రణాళికకు ఇజ్రాయెల్, అరబ్ తదితర ముస్లిం దేశాల నుంచి కూడా మద్దతు లభించింది. బందీల విడుదలకు హమాస్ మొగ్గు చూపడం శాంతి దిశగా పడిన కీలక అడుగుగా అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే దీనిపై తుది ఒప్పందం కుదిరి, గాజాలో యుద్ధానికి ముగింపు పడుతుందని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. హమాస్ నిర్ణయం దరిమిలా గాజాపై బాంబు దాడులను తక్షణం ఆపాలని ఇజ్రాయెల్‌కు అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు జారీచేశారు. ఇంతలో ట్రంప్ ప్రణాళిక మొదటి దశను తక్షణ అమలు చేయడానికి ఇజ్రాయెల్ సిద్ధమవుతోందని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం తెలిపింది.శాశ్వత శాంతికి హమాస్ సిద్ధం?గాజాలో శాంతిని సాధించగల ఏకైక వ్యక్తిగా తనను తాను అభివర్ణించుకున్న ట్రంప్ మిత్రదేశమైన ఇజ్రాయెల్‌కు మద్దతు పలికారు. అలాగే హమాస్ శాశ్వత శాంతికి సిద్ధంగా ఉందని నమ్ముతున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ‘ఇజ్రాయెల్ వెంటనే గాజాపై బాంబు దాడులను ఆపాలి. తద్వారా బందీలను సురక్షితంగా, త్వరగా బయటకు తీసుకురావచ్చు’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో పేర్కొన్నారు. అదేవిధంగా నెతన్యాహు కార్యాలయం ‘ఇజ్రాయెల్.. నిర్దేశిత సూత్రాలకు అనుగుణంగా యుద్ధాన్ని ముగించడానికి సిద్ధంగా, ఉందని, ఇది అధ్యక్షుడు ట్రంప్ దార్శనికతకు అనుగుణంగా ఉంటుంది’ అని తెలిపింది. -
300 మంది మరణించాక.. ఇజ్రాయెల్, సిరియా కాల్పుల విరమణ
డమాస్కస్: సిరియాలోని డ్రూజ్ కమ్యూనిటీ జనాభా అధికంగా కలిగిన స్వీడన్ ప్రావిన్స్‌లో రోజుల తరబడి కొనసాగిన మారణహోమం దరిమిలా ఇజ్రాయెల్- సిరియాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ ఘర్షణల్లో 300 మందికి పైగా జనం మృతిచెందారు. ఈ కాల్పుల విరమణకు ప్రాంతీయ మిత్రదేశాలు టర్కీ, జోర్డాన్ మద్దతు పలికాయి.సిరియాలోని దక్షిణ స్వీడన్ ప్రావిన్స్‌లో రోజుల తరబడి కొనసాగిన హింస అనంతరం ఇజ్రాయెల్- సిరియాలు తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇప్పటివరకూ జరిగిన ఘర్షణల్లో మహిళలు, పిల్లలు, వైద్య సిబ్బందితో సహా మొత్తం 321 మంది మరణించారని మానవ హక్కుల పరిశీలకులు తెలిపారు. సిరియా అధ్యక్ష కార్యాలయం కాల్పుల విరమణను ప్రకటించింది. ఇందుకోసం దక్షిణాన ఒక ప్రత్యేక భద్రతా దళాన్ని మోహరించినట్లు తెలిపింది. పరిస్థితులు తీవ్రతరం కాకుండా నిరోధించడమే లక్ష్యంగా సమన్వయంతో కూడిన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొంది.దక్షిణాన సిరియా సైనిక మోహరింపులను ఇజ్రాయెల్ వ్యతిరేకించినప్పటికీ, 48 గంటల పాటు స్వీడాకు పరిమిత సిరియన్ అంతర్గత భద్రతా దళాల ప్రవేశాన్ని అనుమతిస్తామని తెలిపింది. సిరియా కొత్త నాయకత్వం సిరియా, లెబనాన్, ఇజ్రాయెల్‌లలోని డ్రూజ్ కమ్యూనిటీకి ముప్పు కలిగిస్తోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్.. స్వీడాపై దాడులను కొనసాగించింది. ఇది గతంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడాన్ని సూచిస్తుంది. స్వీడా ప్రావిన్స్‌లోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాలలో ఘర్షణలు ఇంకా కొనసాగుతున్నట్లు స్థానిక వార్తా సంస్థ స్వీడా24 ప్రతినిధి ర్యాన్ మారౌఫ్ తెలిపారు. -
‘అందుకు ఇజ్రాయెల్ ఓకే’: గాజాలో కాల్పుల విరమణపై ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇజ్రాయెల్-గాజా యుద్ధంపై ఆసక్తిరక ప్రకటన చేశారు. ఇరాన్ మద్దతు కలిగిన హమాస్ ఉగ్రవాదులు.. గాజాలో ఇజ్రాయెల్‌తో 60 రోజుల కాల్పుల విరమణకు తుది ప్రతిపాదనకు అంగీకరించాలని కోరారు. దీనికి సంబంధించిన పత్రాలను ఖతార్- ఈజిప్ట్‌కు మధ్యవర్తిత్వం వహించే అధికారులు అందిస్తారని తెలిపారు. ట్రంప్ తన సోషల్ మీడియా పోస్ట్‌లో తమ ప్రతినిధులు గాజా విషయమై ఇజ్రాయెల్ అధికారులతో సుదీర్ఘమైన సమావేశాన్ని నిర్వహించారని తెలిపారు. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తదితరులు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సీనియర్ సలహాదారు రాన్ డెర్మెర్తో సమావేశమయ్యారని సమాచారం. కాగా 60 రోజుల కాల్పుల విరమణను ఖరారు చేసేందుకు రూపొందించిన షరతులను ఇజ్రాయెల్ అంగీకరించిందని, తాము ఈ యుద్ధాన్ని ముగించడానికి అన్ని పార్టీలతో కలిసి పని చేస్తామని ట్రంప్ పేర్కొన్నారు. ఖతార్, ఈజిప్ట్ ప్రతినిధులు హమాస్‌కు ఈ తుది ప్రతిపాదనను అందజేస్తారని ట్రంప్ పేర్కొన్నారు.మిడిల్ ఈస్ట్‌లో మంచి జరిగేందుకు హమాస్ ఈ ఒప్పందాన్ని అంగీకరిస్తుందని భావిస్తున్నానని, దీనికి సమ్మతించని పక్షంలో పరిస్థితులు మరింత దిగజారవచ్చని ట్రంప్ వ్యాఖ్యానించారు. గాజాలో ఇజ్రాయెల్.. హమాస్ ఉగ్రవాదుల మధ్య బందీల విడుదల కోసం ఈ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని ట్రంప్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ తెలిపిన వివరాల ప్రకారం 2023 అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై దాడి చేసి 1,200 మందిని హత్యచేసి, 251 మందిని బందీలుగా పట్టకున్న దరమిల గాజాలో యుద్ధం ప్రారంభమైంది.ఇది కూడా చదవండి: ‘పహల్గామ్’ ముష్కరులపై తక్షణ చర్యలకు ‘క్వాడ్’ డిమాండ్ -
ఇసుక పాలసీకి ఏపీ కేబినేట్ ఆమోదం
-
టాటా, డొకోమో వివాదానికి ముగింపు
న్యూఢిల్లీ: ప్రముఖ వ్యాపారసంస్థ టాటా గ్రూప్ మేజర్ ఆపరేటింగ్ ప్రమోటర్ టాటా సన్స్ లిమిటెడ్, జపాన్‌కు చెందిన టెలికాం కంపెనీ నిప్పాన్ టెలిగ్రాఫ్ అండ్ టెలిఫోన్ కార్పొరేషన్ (ఎన్టీటీ) డొకోమో మధ్య వివాదపరిష్కారానికి ఎట్టకేలకు ముగింపు పడింది. టాటా టెలీసర్వీసెస్, డొకొమో సేవల నేపథ్యంలో ఏర్పడ్డ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు టాటా సన్స్, ఎన్టీటీ డొకోమో ఒక అంగీకారానికి వచ్చాయి. ఎన్టీటీ కోరుతున్న పూర్తిస్థాయి నష్టపరిహార మొత్తాన్ని చెల్లించేందుకు ప్రమోటర్ టాటా సన్స్ అంగీకరించింది. 1.17బిలియన్ డాలర్లను చెల్లించేందుకు టాటాగ్రూప్ అంగీకరించడంతో ఈ వివాదం పరిష్కారమైంది. దీంతో సుమారు రెండు సంవత్సరాలకుపైగా సాగుతున్న వివాదాన్ని ముగిసినట్టయింది. తమ మధ్య వివాదాన్ని ముగింపు పలకనున్నట్టు ఇరు సంస్థలు మంగళవారం ఢిల్లీ హైకోర్టుకు నివేదించారు. ఈ మేరకు డొకోమోపై ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు టాటా సన్స్ అంగీకరించింది. మార్చి 8 దీనికి సంబంధించిన అప్లికేషన్ ను కోర్టు పరిశీలించనుంది. దీంతోపాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోక్యానికి వ్యతిరేకంగా తాము ఈ నిర్ణయం తీసుకోలేదని ఇరు సంస్థలు స్పష్టం చేశాయి. గత సంవత్సరం టాటా సన్స్ ఛైర్మన్ గా సైరస్ మిస్త్రీ ఉద్వాసన తరువాత, డొకొమొ వివాదం పరిష్కారం చర్చలను పునఃప్రారంచింది టాటా గ్రూపు. అయితే విదేశీ పెట్టుబడి నిబంధనలు ఉల్లంఘించినట్లు అవుతుందనే సంకేతాలను కేంద్రబ్యాంకు వెల్లడించింది. మరోవైపు ఈ వార్తలతో టాటా టెలీ సర్వీసెస్ కౌంటర్‌కు మార్కెట్లో డిమాండ్ పుట్టింది. ట్రేడర్ల కొనుగోళ్లతో దాదాపు 9 శాతం లాభాలతో కొనసాగుతోంది. టాటా సన్స్ తో కలసి టాటా టెలి సర్వీసెస్ లో వాటాల బదలీపై ముందు చేసుకున్న ఒప్పందాన్ని టాటా సన్స్ పాటించలేదని డొకోమో ఆరోపించింది ఈ వివాదంలో మధ్యవర్తిత్వం కోరుతూ డొకోమో లండన్‌లోని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో ఈ వివాదంలో సుమారు ఎనిమిదివేల కోట్ల రూపాయల భారీ జరిమానా చెల్లించాలని కోర్టు తీర్పుచెప్పింది. డొకొమోతో చేసుకున్న ఒప్పందాన్ని బేఖాతరు చేశారని ఆరోపణలపై 1.17 బిలియన్ డాలర్ల నష్టపరిహారాన్ని చెల్లించాలని లండన్ లోని అంతర్జాతీయ వివాదాల పరిష్కారాల కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.