Asian Games Cricket: అఫ్గాన్‌ను చిత్తు చేసిన పసికూన
ఆసియా క్రీడలు-2026 పురుషుల టీ20 క్రికెట్లో సంచలనం నమోదైంది. గత ఎడిషన్‌లో రజతం గెలిచిన అఫ్గానిస్తాన్ జట్టుపై.. పసికూన నేపాల్ తాజాగా ఘన విజయం సాధించింది. అఫ్గాన్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి పాయింట్ల ఖాతా తెరిచింది.102 పరుగులేజపాన్లోని నిశిన్లో శుక్రవారం నాటి గ్రూప్- ‘ఎ’ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్- నేపాల్ జట్లు తలపడ్డాయి. కరోగి స్పోర్ట్స్ పార్కు వేదికగా టాస్ గెలిచిన అఫ్గాన్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. నేపాల్ బౌలర్ల ధాటికి తాళలేక నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 102 పరుగులకే పరిమితమైంది.టాపార్డర్‌లో మహ్మద్ అక్రం (2), హసన్ ఐసాఖిల్ (0).. కరీం జనత్ (9) పూర్తిగా విఫలమయ్యారు. నేపాల్ స్పిన్నర్ లలిత్ రాజ్‌బన్షీ అద్భుత బౌలింగ్‌తో ఈ ముగ్గురిని అవుట్ చేశాడు. మిగిలిన వారిలో ఫైజల్ షినోజాదా (30), నజీబుల్లా జద్రాన్ (30) రాణించగా.. కెప్టెన్ డార్విష్ రసూలీ డకౌట్ అయ్యాడు. ఆఖర్లో నంగేయలియా ఖరోటి 17 పరుగులతో అజేయంగా నిలిచాడు.17.2 ఓవర్లలో టార్గెట్ పూర్తినేపాల్ బౌలర్లలో కుశాల్ భుర్తేల్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. లలిత్ రాజ్‌బన్షీ మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్.. 17.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి పని పూర్తి చేసింది.రాణించిన రోహిత్ఓపెనర్లు కుశాల్ భుర్తేల్ (0), ఆసిఫ్ షేక్ (2) నిరాశపరచగా.. వన్‌డౌన్‌లో వచ్చిన సందీప్ జోరా (34) మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. మిగిలిన వారిలో కుశాల్ మల్లా (9), కెప్టెన్ దీపేంద్ర సింగ్ ఐరీ (15) కాస్త ఫర్వాలేదనిపించగా.. రోహిత్ పౌడేల్ (33 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చాడు.అగ్ర స్థానంలోనే అఫ్గాన్.. అఫ్గాన్ బౌలర్లలో ఫరీదూన్ దావూద్జాయ్, అబ్దుల్లా అహ్మద్జాయ్, అరబ్ గుల్ మొమంద్ తలా ఒక వికెట్ తీయగలిగారు. కాగా గ్రూప్-‘ఎ’ నుంచి అఫ్గాన్ ఇప్పటికి రెండు మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. తొలుత జపాన్‌పై గెలిచిన డార్విష్ బృందం.. తాజాగా నేపాల్ చేతిలో ఓడిపోయింది. తద్వారా రెండు పాయింట్లతో అగ్రస్థానంలోనే కొనసాగుతోంది.మరోవైపు.. నేపాల్ తమ తొలి మ్యాచ్‌లోనే అఫ్గాన్‌ను ఓడించి బోణీ కొట్టింది. పాయింట్ల పరంగా నేపాల్ (+0.846)తో సమంగా ఉన్నప్పటికీ నెట్‌రన్‌రేటు పరంగా కాస్త వెనుబడి నేపాల్ (+0.842)పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. కాగా ఐసీసీ టీ20 టీమ్ ర్యాంకింగ్స్‌లో అఫ్గానిస్తాన్ తొమ్మిదో స్థానంలో ఉండగా.. నేపాల్ పదహారో స్థానంలో కొనసాగుతోంది.చదవండి: తొలి టెస్టులో ఆసీస్‌ను మట్టికరిపించిన భారత్