breaking news
adokiye
-
బాలికలను విడిచిపెడితే కన్యత్వం అర్పిస్తా..
నైజీరియా మిలిటెంట్లకు పాప్ గాయని సంచలన ప్రతిపాదన రోజుకు 12 మందితో శృంగారంలో పాల్గొనేందుకూ సిద్ధమేనని ప్రకటన అబూజా: నైజీరియాలో ఆమె ఓ పాప్ సెన్సేషన్. తన అందచందాలతో, ఆటపాటలతో యువతను ఉర్రూతలెక్కించే యువ తరంగం. దీనికితోడు తమ దేశం తరఫున ఐక్యరాజ్య సమితి (ఐరాస) శాంతి పరిరక్షక అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. అలాంటి 23 ఏళ్ల అడోకియేను రెండు నెలల కిందట దేశంలో జరిగిన 276 మంది స్కూలు బాలికల కిడ్నాప్ ఉదంతం కలచి వేసింది. బొకో హరమ్ ఇస్లామిక్ మిలిటెంట్ల చెరలో బందీలుగా ఉన్న బాలికల విడుదల కోసం ప్రభుత్వం ఇప్పటివరకూ చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం, చివరకు అమెరికా ‘ఫస్ట్ లేడీ’ మిషెల్ ఒబామా హాలీవుడ్ తారలతో కలిసి ఈ విషయంలో చేపట్టిన ప్రచారం కూడా సత్ఫలితాన్నివ్వకపోవడంతో ఆమె ఓ అసాధారణ నిర్ణయం తీసుకుంది. బాలికల విడుదల కోసం ఇస్లామిక్ మిలిటెంట్లకు సంచలన ప్రతిపాదన చేసింది. బాలికలను విడిచిపెడితే అందుకు ప్రతిగా తన కన్యత్వాన్ని అర్పించేందుకు సిద్ధమంటూ ప్రకటించింది. బందీలను విడిచిపెట్టి వారి స్థానంలో కావాలంటే తనను ఇష్టమొచ్చినట్లు వాడుకోవచ్చంటూ ప్రతిపాదించింది. ‘‘కిడ్నాప్‌కు గురైన బాలికలంతా అభంశుభం తెలియని అమాయకులు. రెండు నెలలుగా తల్లిదండ్రులకు దూరమై ఎంతో మనోవేదన అనుభవిస్తున్నారు. వారంతా 12 నుంచి 15 ఏళ్ల వయస్కులు. నేను వారికన్నా వయసులో పెద్దదాన్ని. ఒకవేళ ప్రతి రాత్రీ 10-12 మంది మిలిటెంట్లు శృంగారం కోసం నన్ను తీసుకెళ్తానన్నా నేనేమీ పట్టించుకోను. దయచేసి ఆ బాలికలను విడిచిపెట్టి వారి తల్లిదండ్రుల చెంతకు చేర్చండి’’ అంటూ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మిలిటెంట్లకు అడోకియే విజ్ఞప్తి చేసింది. అయితే ఆమె ప్రతిపాదన నెట్లో దుమారం రేపింది. కొందరు నెటిజన్లు ఆమె తెగువను మెచ్చుకోగా మరికొందరేమో ఆమె వ్యాఖ్యలను ప్రచార గిమ్మిక్కుగా అభివర్ణించారు. -
నైజీరియాలోనూ ఒక పూనమ్ పాండే ఉందండోయ్!
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే బీడీ కాల్చుకునేందుకు బోలెడంత నిప్పు దొరికిందన్నాడట ఒకడు. సరిగ్గా అలాంటి పనే చేసింది ఓ నైజీరియన్ పాప్ సింగర్. ప్రస్తుతం నైజీరియాలో అల్ కాయిదా అనుబంధ ఉగ్రవాద సంస్థ బోకో హరామ్ 276 మంది విద్యార్థినులను కిడ్నాప్ చేసింది. ఇది ఏప్రిల్ 14 న జరిగింది. ఆడపిల్లలు చదువుకోవడం మత విరుద్ధమన్నదే బోకోహరామ్ వాదన. అయితే బందీలుగా ఉన్న ఆ విద్యార్థినుల కోసం అన్వేషణ జరుగుతోంది. ఈ సంక్షోభం సాయంతో సులువుగా ప్రచారం పొందవచ్చుననుకుంది నైజీరియన్ పాప్ సింగర్ అడోకియే. 'ఉగ్రవాదులారా... ఆ పిల్లల్ని వదిలిపెట్టండి. మీకు కావాలంటే నన్ను తీసుకెళ్లండి. నా కన్యత్వం మీకు సమర్పించుకుంటా' అని ఓ ఆఫర్ ఇచ్చేసింది. 'వారంతా చిన్నపిల్లలు, నాకు అనుభవం ఉంది. నన్ను రోజుకు 12 మంది అనుభవించినా నాకు పరవాలేదు' అని పేర్కొంది ఆ అమ్మడు. బోకో హరామ్ అడోకియే ఆఫర్ ని తీసుకున్నా తీసుకోకపోయినా అమ్మడికి మాత్రం బోలెడంత ఫ్రీ పబ్లిసిటీ వచ్చేసింది.