breaking news
accountent
-
భారత్ చేతికి మరిన్ని స్విస్ ఖాతాల వివరాలు
న్యూఢిల్లీ/బెర్న్: వార్షిక ఆటోమేటిక్ సమాచార మారి్పడి (ఏఈఓఐ) ఒప్పందం ప్రకారం స్విస్ బ్యాంకుల్లోని ఖాతాదారుల వివరాలకు సంబంధించిన 5వ సెట్‌ను భారత్‌కు స్విట్జర్లాండ్ అందించింది. వీటిలో వందల కొద్దీ ఖాతాల వివరాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందులో కొందరు వ్యక్తులు, కార్పొరేట్లు, ట్రస్టులకు చెందిన అకౌంట్లు అనేకం ఉన్నట్లు వివరించాయి. భారత్‌కు స్విట్జర్లాండ్ అందించిన వివరాల్లో ఖాతాదారు పేరు, చిరునామా, దేశం, ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబరు, ఖాతాల్లో బ్యాలెన్స్ మొదలైనవన్నీ ఉన్నట్లు పేర్కొన్నాయి. గత నెల సెపె్టంబర్లో సమాచార మారి్పడి చోటు చేసుకోగా తదుపరి విడత సెట్‌ను స్విట్జర్లాండ్ 2024 సెప్టెంబర్‌లో భారత్‌కు అందించాల్సి ఉంటుంది. పన్ను చెల్లింపుదారులు ట్యాక్స్ రిటర్నుల్లో తమ ఆర్థిక వివరాలన్నీ సక్రమంగా పొందుపర్చారా లేదా అనేది పరిశీలించేందుకు ఈ వివరాలు ఉపయోగపడతాయి. స్విస్ బ్యాంకుల్లో నల్లధనాన్ని దాచుకుని, పన్నులు ఎగ్గొడుతున్న కుబేరుల ఆటకట్టడానికి ఉద్దేశించిన ఏఈఓఐ కింద భారత్‌కు తొలిసారి 2019 సెపె్టంబర్లో మొదటి సెట్ వివరాలు లభించాయి. మరోవైపు, ఈ ఏడాది మొత్తం 104 దేశాలతో ఆర్థిక ఖాతాల వివరాల మారి్పడి జరిగినట్లు స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌టీఏ) తెలిపింది. 78 దేశాలతో సమాచారం ఇచి్చపుచ్చుకున్నట్లు పేర్కొంది. 25 దేశాల నుంచి తాము వివరాలు తీసుకున్నప్పటికీ ఆయా దేశాల గోప్యత ప్రమాణాలు ఇంకా అంతర్జాతీయ స్థాయిలో లేనందున తాము తమ సమాచారమేమీ ఇవ్వలేదని వివరించింది. -
బ్యాంకులో లెక్కతేలని దోపిడీ
అంకెలగారడీతో మాయం చేశారు ఏసీఈవో, అకౌంటెంట్ నిర్వాకం తిమ్మాపూర్ : జిల్లాలో పేరున్న సంఘాలలో పోరండ్ల సహకార పరపతి సంఘం ఒకటి. సంఘం పరిధిలో బ్యాంకు సైతం కొనసాగుతోంది. లావాదేవీలతోపాటు డిపాజిట్లు, పంట రుణాలు, బంగారు ఆభరణాలపై రుణాలు, భూమి తనఖా, లాంగ్ టర్మ్ రుణాలను సంఘం పరిధిలోని బ్యాంకు ద్వారా కొనసాగుతున్నాయి. ఏడాది క్రితం వరకు పరిస్థితి బాగానే ఉన్నా ఉద్యోగుల వ్యవహారం సంఘానికే మచ్చతెచ్చేలా తయారైంది. 2015–2016 సంవత్సరంలో అంకెల గారడీ చేసి లక్షల రూపాయలు మాయం చేశారని తేలింది. అసిస్టెంట్ సీఈవో గంగారెడ్డి, అకౌంటెంట్ ఆగయ్య తమ తెలివితేటలతో లక్షల రూపాయలను కాజేయగా వీరి దోపిడీ ఇటీవల జరిగిన ఆడిట్లో బయటపడింది. ఇద్దరు కలిసి నలభై లక్షలను మాయం చేశారని ప్రాథమికంగా తెలిసింది. ఇందులో ఆగయ్య రూ.10లక్షలు, గంగారెడ్డి రూ.30లక్షలు తమ స్వంతానికి వినియోగించుకున్నట్లు అధికారులు గుర్తించారు. విషయాన్ని గోప్యంగా ఉంచిన ఆడిటర్లు, సంఘ పాలకవర్గం రికవరీ మొదలుపెట్టారు. ఇరవై రోజుల్లో ఇద్దరి నుంచి రూ.40లక్షల వరకు రికవరీ చేసినట్లు పాలకవర్గం తెలిపింది. ఇప్పటికీ బ్యాంకు లావాదేవీల పుస్తకాలు ఆడిటర్ వద్దనే ఉండడం.. ఆమె ఆడిట్ నివేదికను ఇవ్వకపోవడంతో లెక్కల వ్యవహారం ఇంకా తేలలేదు అంకెల గారడీ... పోరండ్ల సొసైటీ పరిధిలోని బ్యాంకులో అంకెల గారడీతో ఏసీఈవో, అకౌంటెంట్ ఏకంగా రూ.40 లక్షలకుపైగా మాయం చేశారనేది స్పష్టమైంది. బ్యాంకు పొదుపు ఖాతాలలో లావాదేవీలు లేనివాటిని ఎంచుకున్నారు. సుమారు డెబ్బై మందికి చెందిన ఖాతాలలో ఉన్న మొత్తానికి పక్కన అంకెలను చేర్చి లక్షలున్నట్లు చూపిస్తూ, ఖాతాదారుల సంతకాలను ఫోర్జరీ చేసి డబ్బులను విత్ డ్రా చేస్తున్నట్లు రాసుకున్నారు. సంతకాన్ని పరిశీలించే అధికారి ఏసీఈవో కాగా, డబ్బులు ఇచ్చేది అకౌంటెంట్ కావడంతో ఇద్దరూ తమ స్వాహా పర్వాన్ని కొనసాగించారు. వడ్డీ మాటేంటీ..? ఉద్యోగులు కాజేసిన రూ.40లక్షల బ్యాంకు డబ్బులకు లావాదేవీల రూపంలో వడ్డీ జమయ్యేది. ఏడాది కాలంలో రూ.40లక్షలు వాడుకున్న ఉద్యోగుల నుంచి అంతే మొత్తాన్ని రికవరీ చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంత మొత్తానికి వడ్డీని ఎందుకు వసూలు చేయడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. అసలుతోపాటు వడ్డీని కలిపి మొత్తం రికవరీ అయ్యేలా చూడాలని సంఘ సభ్యులు కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం... – దేవేందర్ రెడ్డి, సంఘం చైర్మన్ ఉద్యోగులు అవకతవకలకు పాల్పడినట్లు ఇరవై రోజుల క్రితమే మా దష్టికి వచ్చింది. ఇప్పటి వరకు రూ.40లక్షలు రికవరీ చేశాము. ఇంకా ఆడిటర్ పూర్తి నివేదిక ఇవ్వలేదు. వడ్డీతో కలిపి అసలు రికవరీ చేసి సోమవారం పాలకవర్గ సమావేశంలో ఇద్దరిపై చర్యలు తీసుకుంటాం. సభ్యులు ఆందోళన చెందవద్దు.