breaking news
abhishek gupta
-
సస్పెన్షన్‌లో ఉన్న క్రికెటర్‌కి జట్టులో చోటు..
ఢిల్లీ: చిత్రవిచిత్రమైన పనులు చేయడంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) రూటే సపరేటు. డోపింగ్‌లో సస్పెన్షన్‌కు గురైన క్రికెటర్‌ను దులీప్ ట్రోఫీకి ఎంపిక చేసిన బోర్డు అభాసుపాలైంది. పంజాబ్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ అభిషేక్ గుప్తాకు ఇండియా రెడ్ జట్టులో చోటు కల్పించారు. అయితే, అతడి సస్పెన్షన్ సెప్టెంబర్ 14తో ముగుస్తుంది. కానీ దులీప్ ట్రోఫీ వచ్చే నెల 17 నుంచి సెప్టెంబర్ 8 వరకు జరగనుంది. గుప్తా నిషిద్ధ ఉత్ర్పేరకం టర్బుటలిన్ ఉపయోగించినట్టు డోపింగ్ పరీక్షలో బయటపడడంతో అతడిపై జనవరి 15 నుంచి ఎనిమిది నెలలపాటు సస్పెన్షన్ వేటు వేశారు. అయినా సెలెక్టర్లు అతడిని ఎంపిక చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. చదవండి: డోపింగ్‌కు పాల్పడినందుకు కీపర్‌పై వేటు -
డోపింగ్‌కు పాల్పడినందుకు కీపర్‌పై వేటు
న్యూఢిల్లీ: పంజాబ్ వికెట్ కీపర్ అభిషేక్ గుప్తాపై బీసీసీఐ 8 నెలల సస్పెన్షన్ వేటు వేసింది. 27 ఏళ్ల పంజాబ్ ఆటగాడు నిషేధిత ఉత్ప్రేరకం టెర్బుటలైన్ తీసుకున్నట్లు పరీక్షల్లో తేలడంతో సస్పెండ్ చేశారు. ఈ మేరకు జనవరి నిర్వహించిన బీసీసీఐ డోపింగ్ టెస్టింగ్ ప్రోగ్రామ్‌లో అభిషేక్ నిషేధిత ఉత్పేరకం వాడినట్లు తేలింది. ఈ విషయాన్ని గురువారం బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. దాంతో అతనిపై 8 నెలల నిషేధం విధించింది. అయితే దగ్గు టానిక్‌లో ఉండే ఉత్ప్రేరకాన్ని తను డాక్టర్ సూచన మేరకే వాడినట్లు అభిషేక్ ఇచ్చిన వివరణతో నిషేధాన్ని 8 నెలలకే పరిమితం చేసింది. ఈ నిషేధం జనవరి 15వ తేదీ నుంచి సెప్టెంబర్ 14 తేదీ వరకూ అమల్లో ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. ఇలా డోపింగ్ పాల్పడిన తొలి పంజాబ్ క్రికెటర్‌గా అభిషేక్ కావడం గమనార్హం. -
‘సూపర్ 30’ విద్యార్థికి సూపర్ ఆఫర్
పాట్నా: బీహార్‌లోని ‘సూపర్ 30’ కోచింగ్ సెంటర్‌కు చెందిన అభిషేక్ గుప్తాకు అరుదైన గుర్తింపు లభించింది. టోక్యో విశ్వవిద్యాలయంలో ‘ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ ఎన్విరాన్మెంటల్ సైన్స్’లో నాలుగేళ్ల కోర్సు చదివేందుకు ఫెల్లోషిప్ లభించింది. జనరేటర్ ఆపరేటర్ కుమారుడైన అభిషేక్‌కు ఉపకార వేతనం కిందనాలుగేళ్లకు 53.90 లక్షల రూపాయలు, ప్రవేశ రుసుం కింద 28.36 లక్షల రూపాయలు, నెలవారి ఖర్చుల కింద నెలకు 12.68 లక్షల రూపాయలు చెల్లిస్తారు. ఇంకా ఐఐటి ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలు వెలువడకముందే అతనికి ఫెల్లోషిప్ లభించడం ‘సూపర్ 30’కి గర్వకారణం. ప్రతి ఏట అణగారిన వర్గాలకు చెందిన 30 మంది విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇచ్చి ఇంజనీర్లను చేస్తున్న సూపర్ 30 కోచింగ్ సెంటర్‌కు అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు గడించిన విషయం తెల్సిందే. టోక్యో విశ్వవిద్యాలయ అధికారులు గతేడాది సూపర్ 30 కోచింగ్ సెంటర్‌ను సందర్శించారని, ఆ సందర్భంగా తమ ఇనిస్టిట్యూట్ నుంచి ఈ ఏడాది ఒకరికి ఉన్నత చదువులు చదివేందుకు అవకాశం కల్పిస్తామని, అన్ని ఖర్చులు స్కాలర్షిప్ కింద తామే భరిస్తామని చెప్పారని, ఇప్పుడు ఆ అవకాశం అభిషేక్‌కు లభించిందని ఇనిస్టిట్యూట్ వ్యవస్థాపకుడు ఆనంద్ కుమార్ తెలిపారు. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన జపాన్‌లో చదివేందుకు తనకు ఈ విధంగా అదృష్టం కలిసొస్తుందని తానేన్నడూ ఊహించలేదని, అక్కడ తన విద్యాభ్యాసం పూర్తి చేశాక పేద విద్యార్థులకు సహాయం చేస్తానని అభిషేక్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కొడుకుకు దక్కిన ఈ అరుదైన గుర్తింపునకు ఎంతో ఉప్పొంగి పోతున్నానంటూ అతని తండ్రి దిలీప్ గుప్తా ఆనంద భాష్పాలు రాల్చారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తాను పదోతరగతికి మించి చదువుకోలేక పోయానని, కొడుకు ఉన్నత చదువులు చదివించేందుకు కూడా తనకు ఆర్థిక స్థోమత లేదని, సూపర్ 30 సంస్థ పుణ్యమాని తన కొడుకుకు ఈ అదృష్టం వరించిందని ఆయన వ్యాఖ్యానించారు.