breaking news
ABHIBUS
-
ఓటర్లకు బస్ టికెట్లో రాయితీ.. ఎంతంటే..
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటు నమోదిత శాతం పెంచాలని ఎన్నికలసంఘం ప్రచారం చేస్తోంది. అందులో భాగంగా ప్రముఖ కంపెనీలు ఓటు శాతం పెంచేలా తమ కస్టమర్లకు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా ఆన్లైన్ బస్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ‘అభిబస్’ ఓటు వేసేందుకు తమ సొంత ప్రాంతాలకు వెళ్లే వారికి ప్రత్యేక రాయితీ కల్పిస్తున్నట్లు ప్రకటించింది.ఈమేరకు సంస్థ సీఈఓ లెనిన్ కోడూరు, సీఓఓ రోహిత్ శర్మ మాట్లాడారు. ‘తెలుగు రాష్ట్రాల్లో మే 11 నుంచి సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఓటు వేసేందుకు తమ సొంత ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ABHIVOTE కూపన్ కోడ్ ఉపయోగించి టికెట్ ధరలో కనీసం 20 శాతం నుంచి గరిష్ఠంగా రూ.250 వరకు రాయితీ పొందొచ్చు. దీంతోపాటు రూ.100 క్యాష్‌బ్యాక్ కూడా పొందే వీలుంది’ అని చెప్పారు.ఇదీ చదవండి: మీపేరుపై ఎన్ని సిమ్‌కార్డులున్నాయో తెలుసుకోండిలా..ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ గతంలో ఓటర్లకు ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే. తొలిసారి ఓటు వేయబోయే యువ ఓటర్లకు దేశీయ, ఇంటర్నేషనల్ సర్వీసుల టికెట్ ధరలపై 19 శాతం రాయితీ ఇస్తున్నట్లు చెప్పింది. -
ఐఆర్సీటీసీలో బస్ టికెట్ల బుకింగ్
ముంబై: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ)లో ఇక నుంచి బస్ టికెట్లను కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఆన్లైన్ ఈ-టికెటింగ్ ఫ్లాట్‌ఫామ్ అభిబస్, ఐఆర్సీటీసీ మధ్య ఒప్పందం జరిగింది. దీంతో ఐఆర్సీటీసీ కస్టమర్లు వారి అవసరాలకు అనుగుణంగా అభిబస్లోని వివిధ మార్గాలలో ఎసీ, నాన్-ఏసీ టికెట్లను బుకింగ్ చేసుకునే అవకాశం లభిస్తుంది. కస్టమర్లు రైల్ టికెట్ బుకింగ్ సమయంలో వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటే.. వెంటనే వారికి అదే గమ్యస్థానంలో బస్ మార్గాల లభ్యతను సూచిస్తుందని, దీంతో ప్రయాణికులు ఇబ్బందులు లేని టికెట్ బుకింగ్ సేవలను అందుకోవచ్చని తెలిపింది. ప్రతి రోజు ఐఆర్సీటీసీ 9లక్షల ట్రెయిన్ టికెట్లను విక్రయిస్తుండగా.. అభిబస్.కామ్, యాప్‌ల ద్వారా 30 వేల బుకింగ్స్‌ను అందిస్తోంది. ఇప్పటివరకు సుమారు 45 మిలియన్ యూజర్లు అభిబస్ సేవలను వినియోగించు కున్నారని చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ శశాంక కూనా తెలిపారు. చదవండి: క్రిప్టోకరెన్సీపై ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు! -
అభీబస్ ఆఫర్ పై ఆగ్రహజ్వాల
► భగ్గుమంటున్న ఆర్టీసీ కార్మిక సంఘాలు ► మార్కెటింగ్ కోసమేనంటున్న ఆర్టీసీ ► ఇతర రాష్ట్రాల్లో నిషేధించిన సంస్థకు అప్పగించడంపై ఆందోళన ► మూడు రెట్ల ఆదాయం ఇస్తామని ఇచ్చిన బంపర్ ఆఫర్ డొక్కు బస్సులతో సాధ్యమా..? ► ఆర్టీసీ కార్మిక సంఘాల నిరసన గళం విజయనగరం అర్బన్: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ టిక్కెట్ల ఆన్లైన్ విక్రయాలను ప్రైవేటు సంస్థకు అప్పగించడంపై కార్మికులు మండిపడుతున్నారు. ఆన్లైన్ పాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్(ఓఆర్ఎస్)ఏజెంట్‌గా అభీబస్ సంస్థను ఎంపిక చేయడంపై కార్మికలోకం భగ్గమంటోంది. సంస్థ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి మార్చి 1 నుంచి అన్ని బస్స్టేషన్ల కరెంట్, అడ్వాన్స్డ్ రిజర్వేషన్ ప్రక్రియను అభీబస్ చేపట్టబోతోందంటూ ఆర్టీసీ ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. నిర్వహణ బాగోలేదని తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో నిషేధించిన అభీబస్ సంస్థకు బాధ్యతలు కట్టబెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలోని ఆర్టీసీ నార్త్, ఈస్ట్ కోస్ట్ (నెక్) రీజియల్ పరిధిలోని తొమ్మిది డిపోల వద్ద ఉద్యోగులు గురువారం ఆందోళనకు దిగారు. ఆర్టీసీ సంస్థ, ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినదించారు. సంస్థ తీరులో మార్పురాకుంటే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. దశాబ్దకాలంగా ఆర్టీసీ ఆన్లైన్ పాసింజర్ రిజర్వేషన్ విధానాన్ని చేపడుతోంది. ఈ విధానంలో భాగంగా అధీకృత ఏజెంట్లను నియమించి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నారు. అధీకృత ఏజెంట్లతో పాటు బస్స్టేషన్లలో ఆర్టీసీ సొంతంగా కరెంట్, అడ్వాన్స్డ్ రిజర్వేషన్ బుకింగ్ కౌంటర్లు నడుపుతోంది. ఆర్టీసీ రీజియన్‌లోని తొమ్మిది డిపోల పరిధిలో సుమారు 50 మంది నిరుద్యోగులు పనిచేస్తున్నారు. తాజాగా వీటికి అదనంగా అభీబస్ సంస్థను ఆర్టీసీ తన ఏజంట్‌గా నియమించింది. ఈ సంస్థకు బస్స్టేషన్లలో బుకింగ్ కౌంటర్స్‌ను అప్పగించింది. ఆర్టీసీ సాఫ్ట్వేర్ అంతా అభీబస్ సంస్థ ఆధీనంలోకి వెళ్లబోతోంది. ఆర్టీసీ ఏసీ బస్సుకు రూ.7, ఆర్టినరీ బస్సుకు రూ.5 చొప్పున అభీబస్ సంస్థకు కమిషన్ చెల్లించేలా రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల రిజర్వేషన్ కేంద్రాలను అప్పగిస్తూ ఒప్పందం కుదుర్చుకున్నారు. విస్తృత రవాణా నెట్వర్క్ కలిగిన అభీబస్... ఆర్టీసీ ఏజంట్‌గా చేరడం వల్ల సంస్థకు చెందిన ఆర్టీసీ బస్సులు ప్రాచుర్యం పొందుతాయని, ఆదాయం సమకూరుతుందని, ఆక్యుపెన్సీ రేషియో వస్తుందని ఆర్టీసీ ఉన్నతాధికారులు అభిప్రాయ పడుతున్నారు. అయితే, సంస్థను అంచెలంచెలుగా ప్రైవేటీకరణ చేసేందుకు పూనుకున్నారని, ఉపాధిని దెబ్బతీసేందుకు పెద్దలు కుట్రపన్నుతున్నారంటూ ఆర్టీసీ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఆందోళనను తీవ్రతరం చేస్తున్నారు.