రేపే ఇజ్రాయెల్ సార్వత్రిక ఎన్నికలు
జెరూసలేం: ఇజ్రాయెల్ సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని బెంజమిన్ నెతన్యాహును ఓడించేందుకు ఆ దేశంలోని ప్రతిపక్షాలు నడుంబిగించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా, మంగళవారం జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో ఓటు వేసేందుకు విదేశాల్లో స్థిరపడ్డ ఇజ్రాయెలీలు స్వదేశానికి క్యూకట్టారు.వాల్‌స్ట్రీట్ జర్నల్ ప్రకారం.. 2023 అక్టోబర్‌లో జరిగిన హమాస్ దాడి, తదనంతరం చోటుచేసుకున్న యుద్ధ పరిణామాల నేపథ్యంలో ఈ ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. చావో రేవో అన్న చందంగా జరగనున్న ఈ ఎన్నికల్లో, ఇజ్రాయిలీలు ఓటు వేసేందుకు స్వదేశానికి తిరిగి వచ్చేలా అమెరికా స్వచ్ఛంద సంస్థ ‘ఫ్లై అండ్ ఓట్’ సహాయపడుతోంది. ఈ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం, సుమారు 67,000 మంది ప్రవాస ఇజ్రాయెలీలు ఈ ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి తిరిగి రానున్నట్లు సమాచారం.నెతన్యాహుకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ ప్రవాసులు?2023 అక్టోబర్ 7న జరిగిన దాడి, ఆ తర్వాత బెంజమిన్ నెతన్యాహు జరిపిన దాడుల అనంతరం జరుగుతున్న మొదటి ఎన్నికలు మంగళవారం జరగనున్నాయి. ఈ దాడులలో సుమారు 75,000 మంది (అంచనా) పాలస్తీనియన్లు మరణించగా, గాజా జనాభా మొత్తం అంతర్గతంగా నిరాశ్రయులయ్యారు. తిరిగి వస్తున్న ప్రవాసులు ఎలా ఓటు వేయాలని యోచిస్తున్నారనే దానిపై ఎటువంటి సమాచారం లేనప్పటికీ, వారిలో చాలామంది నెతన్యాహుకు వ్యతిరేకంగా తమ ఓటు వేస్తామని వాల్‌స్ట్రీట్ జర్నల్‌కి తెలిపారు. ఓటు వేయడానికి విమానాల్లో వస్తున్న వారిలో కొందరు, నెతన్యాహు పదవీకాలంలో చాలాకాలం పాటు ప్రధాన భాగంగా నిలిచిన ఆయనకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలలో పాల్గొన్నారు.అక్టోబర్ 7 దాడులకు నెతన్యాహునే కారణమని ఆయన విమర్శకులు ఆరోపిస్తున్నారు. నెతన్యాహు ప్రజాస్వామ్య సంస్థలను బలహీనపరిచారని, రాజకీయ ప్రయోజనాల కోసం యుద్ధాలను పొడిగించారని, గాజా యుద్ధంలో ఇజ్రాయెల్ ప్రవర్తన కారణంగా దాని అంతర్జాతీయ ప్రతిష్టను దెబ్బతీశారని కూడా వారు ఆరోపిస్తున్నారు. లికుడ్ పార్టీ అంతకుముందే ఎన్నికల సంఘాన్ని 'ఫ్లై ఓట్' కార్యక్రమాన్ని నిలిపివేయాలని కోరింది.