భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు తన కలను సాకారం చేసుకునే దిశగా ముందడుగు వేసింది
తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పీసీ సింధు సెంటర్ ఫర్ బ్యాడ్మింటన్ అండ్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్’ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది
ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా పీవీ సింధు అభిమానులతో పంచుకుంది
విశాఖపట్నంలో తన అకాడమీని స్థాపిస్తున్నానన్న సింధు... భవిష్యత్ తరాల కోసం తాను తీసుకున్న సాహసోపేత నిర్ణయమని పేర్కొంది.
ఈ క్రమంలో పీవీ సింధుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి
కాగా వైస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వం 2021లో పీవీ సింధు కు విశాఖపట్నంలో స్థలం కేటాయించింది.


