ప్యారిస్‌ ఒలింపిక్స్‌-2024: బరిలో ఉన్న తెలుగు అమ్మాయిలు వీరే (ఫొటోలు) | Indian womens at Paris Olympics 2024 Photos | Sakshi
Sakshi News home page

ప్యారిస్‌ ఒలింపిక్స్‌-2024: బరిలో ఉన్న తెలుగు అమ్మాయిలు వీరే (ఫొటోలు)

Jul 25 2024 7:24 PM | Updated on Jul 25 2024 8:05 PM

Indian womens at Paris Olympics 2024 Photos1
1/6

ప్యారిస్‌ ఒలింపిక్స్‌-2024లో భారత్‌ నుంచి 117 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. ఇందులో 40 మందికి పైగా మహిళా క్రీడాకారులు ఉన్నారు. మరి మన తెలుగు అమ్మాయిలు ఎంత మంది ఉన్నారంటే?

Indian womens at Paris Olympics 2024 Photos2
2/6

పీవీ సింధు- బ్యాడ్మింటన్‌ పీవీ సింధు రియో ఒలింపిక్స్‌-2016లో రజతం, టోక్యో ఒలింపిక్స్‌-2020లో కాంస్యం గెలిచిన ఘనత సింధు సొంతం

Indian womens at Paris Olympics 2024 Photos3
3/6

నిఖత్‌ జరీన్‌- బాక్సింగ్‌ నిజామాబాద్‌కు చెందిన నిఖత్‌ జరీన్‌ వరల్డ్‌ చాంపియన్‌. మహిళల 50 కేజీల బాక్సింగ్‌ విభాగంలో తలపడుతోంది.

Indian womens at Paris Olympics 2024 Photos4
4/6

జ్యోతి యర్రాజీ- 100 మీటర్ల హార్డిల్స్‌ రేస్‌ ఒలింపిక్స్‌లో 100 మీటర్ల హార్డిల్స్‌ రేసులో పోటీ పడుతున్న భారత తొలి అథ్లెట్‌ జ్యోతి యర్రాజీ. విశాఖపట్నానికి చెందిన ఈ అమ్మాయి ఖాతాలో ఆసియా, అంతర్జాతీయ పోటీల్లో పది పతకాలు , రెండు కామన్వెల్త్‌ పతకాలు కూడా ఉన్నాయి.

Indian womens at Paris Olympics 2024 Photos5
5/6

శ్రీజ ఆకుల- టేబుల్‌ టెన్నిస్‌ హైదరాబాద్‌కు చెందిన ఆకుల శ్రీజ వరల్డ్‌ టేబుల్‌ టెన్నిస్‌ సింగిల్స్‌లో పసిడి గెలిచిన భారత తొలి టీటీ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది.

Indian womens at Paris Olympics 2024 Photos6
6/6

దండి జ్యోతిక శ్రీ- 4X400 మీటర్ల రిలే ఈవెంట్‌ పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన దండి జ్యోతికశ్రీ ఈ ఏడాది అథ్లెటిక్స్‌ 4X400 రిలే ఈవెంట్‌కు ప్రాతినిధ్యం వహించనుంది. ఇప్పటి వరకు ఆమె రెండు అంతర్జాతీయ పతకాలు, ఆరు జాతీయ పతకాలు సాధించింది. ఒలింపిక్స్‌ భారత జట్లకు జరిగిన పోటీల్లో విశేష క్రీడా నైపుణ్యం ప్రదర్శించి ప్యారిస్‌కు పయనమైంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement