రాణి ముఖర్జీ.. తన సినిమాకు తనే హీరో!
మర్దానీ వంటి సినిమాల్లో ఆమె నటనను అంత ఈజీగా మర్చిపోలేం.
గ్లామర్ పాత్రలైనా, ఎమోషనల్ సీన్స్ అయినా కట్టిపడేసే రాణి బర్త్‌డే నేడు (మార్చి 21).
బాల్యంలో తన బర్త్‌డే సెలబ్రేషన్స్ పెద్దగా జరిగేవి కాదట!
సరిగ్గా తన పుట్టినరోజు నాడు ఏదో ఒక ఎగ్జామ్ ఉండేదట..
దీంతో పక్కనున్నవాళ్లకు ఒకటీరెండు చాక్లెట్లు ఇచ్చి ఊరుకునేదట!
అందుకే తన కూతురి బర్త్‌డేను ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తూ ఉంటుంది. అందులోనే తాను కోల్పోయిన సంతోషాన్ని వెతుక్కుని మురిసిపోతుంది.
రాణీ ముఖర్జీ.. బియర్ ఫూల్ (1996) అనే బెంగాలీ సినిమాతో ప్రయాణం మొదలుపెట్టింది.
దీనికి ఆయన తండ్రి రామ్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు.
రాజాఈ ఆయేగి బరాత్ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది.
ఎన్నో సినిమాల్లో నటించింది. యువ, వీర-జార, బ్లాక్, మర్దానీ, మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే వంటి చెప్పుకోదగ్గ చిత్రాల్లో యాక్ట్ చేసి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది.
నిర్మాత ఆదిత్య చోప్రాను 2014లో పెళ్లాడింది.
అతడికి ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. మొదటి భార్యకు విడాకులిచ్చిన కొంతకాలానికి రాణీని వివాహం చేసుకున్నాడు.
వీరికి ఓ కూతురు పుట్టింది. 2020లో రాణీకి రెండోసారి ప్రెగ్నెన్సీ వచ్చింది. కానీ ఐదు నెలలకే గర్భస్రావమైంది.
సరిగ్గా అదే సమయంలో మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే సినిమా అవకాశం రావడంతో క్షణం ఆలోచించకుండా ఒప్పుకుంది.
ఆ సినిమా తనకెంతో పేరు తెచ్చిపెట్టింది.


