బిగ్‌బాస్ ఆశ్వద్ధామగా ఫేమస్ అయిన గౌతమ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్
టాప్-2 వరకు వచ్చిన గౌతమ్ కృష్ణ.. రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు
గత సీజన్‌లో పాల్గొన్న గౌతమ్.. ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌసులోకి వచ్చాడు
మాట్లాడే, ప్రవర్తించే విషయంలో గౌతమ్‌పై చాలానే కంప్లైంట్స్ ఉన్నాయి
కానీ అగ్రిసెవ్‌నెస్ వల్ల గౌతమ్ కూడా బోలెడంత మంది ఫ్యాన్స్‌ని సంపాదించుకున్నాడు
అలా ఎప్పటికప్పుడు తన ఓటింగ్ శాతాన్ని పెంచుకుంటూ ఫైనల్ వరకు వచ్చాడు
అయితే తొలి నుంచి ఉన్న నిఖిల్ గట్టిగానే పోటీ ఇచ్చాడు. దీంతో గౌతమ్.. రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది
అయితే చివరి క్షణాల్లో హౌసులోకి వచ్చిన నాగార్జున.. గోల్డెన్ సూట్ కేసు ఆఫర్ చేశాడు
సూట్ కేసులో ఎంత మొత్తం ఉందో తెలీదు కానీ గౌతమ్ సూట్ కేసు వద్దనుకున్నాడు
దీంతో కేవలం రెమ్యునరేషన్ తీసుకుని మాత్రమే గౌతమ్ బిగ్‌బాస్ నుంచి బయటకొచ్చాడు
వారానికి రూ.1.75 లక్షల చొప్పున గౌతమ్ కృష్ణ ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది
అంటే 10 వారాలకు గానూ రూ.17.5 లక్షల రెమ్యునరేషన్ మాత్రమే గౌతమ్ అందుకున్నాడు


