
టెక్ దిగ్గజం గూగుల్ బెంగళూరులో తమ కొత్త క్యాంపస్‌ను ప్రారంభించింది.

దీనికి ’అనంత’ అని పేరు పెట్టినట్లు కంపెనీ ఒక బ్లాగ్ పోస్టులో వెల్లడించింది.

అంతర్జాతీయంగా తమకున్న భారీ కార్యాలయాల్లో ఇది కూడా ఒకటని పేర్కొంది.

అనంత అంటే 'అపరిమితం' అని అర్థం. ఇది టెక్నాలజీ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అపరిమితమైన అవకాశాలను సూచిస్తుంది.

గూగుల్ అనంతలో 100 శాతం మురుగునీటి రీసైక్లింగ్, వర్షపునీటి సేకరణ.. పవర్ వినియోగాన్ని తగ్గించడానికి పెద్ద స్మార్ట్ గ్లాస్ ఇన్‌స్టాలేషన్ వంటివి ఉన్నాయి.

ఇంటీరియర్ మెటీరియల్స్ కోసం దాదాపు పూర్తిగా స్థానికంగా ఉన్నవాటినే ఉపయోగించారు.







