లోపాలు లేని ఓటర్ల జాబితా ఎన్నికలకు పునాదిలాంటిది

ss rawath in collectorate office vizianagaram - Sakshi

ఓటర్ల జాబితా పరిశీలకులు ఎస్‌.ఎస్‌.రావత్‌

విజయనగరం గంటస్తంభం : ప్రజాస్వామ్యానికి పునాది ఎన్నికలైతే... లోపాలు లేని ఓటర్ల జాబితా ఎన్నికలకు  పునాదిలాంటిదని ఓటర్ల జాబితా పరిశీలకులు, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.ఎస్‌. రావత్‌ అన్నారు. కలెక్టరేట్‌ కార్యాలయంలో శుక్రవారం ఓటర్ల  నమోదు అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితా రూపకల్పన ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్లు పేర్లు తప్పుగా నమోదు చేయడంపై ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఎన్నికలే కాదు ఓటర్ల జాబితా పక్కాగా రూపోందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో  రాజ కీయ నాయకులు అధికారులకు సహకరించాలని కోరారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఓటరు జాబితా తయారు చేయాలని, ఎటువంటి పొరపాట్లు జరిగినా చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.

4,196 దరఖాస్తుల స్వీకరణ
జిల్లాలో 18 ఏళ్లు నిండిన యువత 7,738 మంది ఉన్నారని, ఇప్పటివరకు ఓటు నమోదుకు 4,196 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ ఈ సందర్భంగా పరిశీలకులకు తెలియజేశారు. జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు మూడు పార్లమెంట్‌ స్థానాలు పరిధిలో విస్తరించి ఉన్నాయన్నారు. జిల్లాలో 2,152 పోలింగ్‌  కేంద్రాలు ఉన్నాయని, 16.43 లక్షల ఓటర్లు ప్రస్తుతం ఉన్నారన్నారు. రాజకీయ పార్టీలతో ఇప్పటికే  ఒక సమావేశం నిర్వహించామన్నారు. స్థానిక మీడియా ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో  వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు  పలు సూచనలు చేశారు. కళాశాల యజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసి 18ఏళ్లు నిండిన విద్యార్థులను ఓటర్లుగా నమోదు చేసేందుకు దరఖాస్తులు తీసుకోవాలని వైఎస్సాఆర్‌ సీపీ నాయకులు మామిడి అప్పలనాయుడు కోరారు.
కార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ ప్రతినిధి బొంగా భానుమూర్తి, టీడీపీ నాయకుడు పొగిరి పైడిరాజు, సీపీఐ నాయకులు రెడ్డి శంకరరావులు పలు సలహాలిచ్చారు. కార్యక్రమంలో జేసీ శ్రీకేష్‌ లఠ్కర్, డీఆర్వో రాజ్‌కుమార్, ఓటర్ల రిజిస్ట్రేషన్‌ అధికారులు సుదర్శనదొర, ఆర్‌.శ్రీలత, ఎస్‌.డి. అనిత, సాల్మన్‌రాజ్, గణపతిరావు, బాలత్రిపురసుందరి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పెద్దింటి జగన్‌మోహనరావు, లోక్‌సత్తా ప్రతినిధి కోటేశ్వరరావు, బీఎస్పీ నాయకులు సోములు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read latest Vizianagaram News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top