ఢిల్లీలో చలి | opinion on by dr n.gopi | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో చలి

Jan 4 2016 12:36 AM | Updated on Sep 3 2017 3:01 PM

ఢిల్లీకి ఏదీ సొంతం కాదు ఆఖరికి చలి కూడా. ఇవాళటి శీతల ఘాతాలు సిమ్లా నుంచి దూసుకొస్తున్నాయి.

ఢిల్లీకి ఏదీ సొంతం కాదు
 ఆఖరికి చలి కూడా.
 ఇవాళటి శీతల ఘాతాలు
 సిమ్లా నుంచి దూసుకొస్తున్నాయి.
 రాజస్థాన్ ఎడారి
 తక్కువేమీ తినలేదు
 ఇసుక రజనును
 మంచుపొడిగా మార్చి పారేసింది.
 
 ఇది మెత్తగా నిమిరే చలి కాదు
 గోళ్లతో రక్కే చలి.
 గజగజా వొణుకు,
 నిన్న నీతో మాట్లాడిన మాటలు
 గదినిండా గడ్డ కట్టాయి.
 
 పొగమంచులో ఇండియా గేటు
 స్ఫురించీ స్ఫురించని
 అస్పష్ట కవిత్వంలా వుంది
 పార్లమెంటులో మోగుతున్న
 డప్పుల్లో మునుపటి దమ్ము లేదు.
 
 ఢిల్లీకి ఏదీ సొంతం కాదు
 ఆఖరికి చలి కూడా.

(డాక్టర్ ఎన్.గోపి,  040-27037585)

Advertisement
 
Advertisement
Advertisement