పశువులకు కుక్కకాటుపై నిర్లక్ష్యం వద్దు | Do not neglect on dog bite to cattle | Sakshi
Sakshi News home page

పశువులకు కుక్కకాటుపై నిర్లక్ష్యం వద్దు

Aug 18 2014 12:25 AM | Updated on Sep 29 2018 3:55 PM

వీధి కుక్కలు పశువులను కరిచినప్పుడు నిర్లక్ష్యం వహించకుండా యాంటీ రేబిస్ టీకాలు వేయించాలి.

ఆదిలాబాద్ అగ్రికల్చర్ : వీధి కుక్కలు పశువులను కరిచినప్పుడు నిర్లక్ష్యం వహించకుండా యాంటీ రేబిస్ టీకాలు వేయించాలి. నాటు వైద్యంపై ఆధారపడవద్దు. జిల్లాలోని అన్ని పశు వైద్యశాల కేంద్రాల్లో టీకాలు అందుబాటులో ఉన్నా యి. జిల్లాలోని డివిజన్ కేంద్రాలు నిర్మల్‌కు 500, మం చిర్యాలకు 350, ఆదిలాబాద్‌కు 150 వ్యాక్సిన్లు అందజేశాం. కుక్కకాటు బారిన పశువులకు టీకాలు వేయించాలి. జిల్లాలో సుమారు 18వేల వరకు కుక్కలు ఉన్నా యి.

 ఈ ఏడాది జూలై వరకు సారంగాపూర్ మండలంలో 40, జైపూర్‌లో 25, లక్ష్మణచాందలో 15 పశువులను కుక్కలు కరిచాయి. పశువులను మూతి భాగంలో కరుస్తాయి కాబట్టి వాటికి త్వరగా వెర్రి లేచే ప్రమాదముంది. కుక్కలు పశువుల దగ్గరకు రాగానే కొమ్ములతో పొడిచే ప్రయత్నం చేస్తాయి. దీంతో మూతి, ముక్కు దగ్గర ఎక్కువగా కరుస్తాయి. రేబిస్ వైరస్ రక్తనాళాల గుండా చిన్నమెదడుకు త్వరగా చేరి చనిపోయే ప్రమాదం ఉంటుంది. మనిషిని కాటు వేస్తే 20 సంవత్సరాల వరకు బతికే అవకాశం ఉంది. కానీ పశువులు రెండేళ్లకంటే ఎక్కువగా జీవించే అవకాశాలు లేవు.

 లక్షణాలు..
కుక్కకాటుకు గురైన పశువులు గడ్డి తినకుండా 105 డిగ్రీల నుంచి 108 డిగ్రీల జ్వరంతో బాధపడుతుంది. నోటి నుంచి సొల్లు కారుస్తూ ఎప్పుడూ నిల్చోనే ఉంటాయి. వాటికి కళ్లముందు ఏమీ కనిపించవు. ఎవరినైనా పొడిచే ప్రయత్నం చేస్తాయి. వీటికి నీటిని చూస్తే భయంగా ఉంటుంది.

వర్సాకాలం నాడీ వ్యవస్థపై రేబిస్ ప్రభావం త్వరగా మెదడుకు చేరుతుంది. చల్లటి వాతావరణంలో ఇది రక్తనాళాలల్లో చిన్నమెదడుకు చురుగ్గా చేరి దశదిశ లేకుండా ప్రయాణిస్తుంటాయి. నోరు మూగ పడిపోయి తరచూ మూత్ర విసర్జన చేస్తాయి. వెనక కాలు జాడిస్తూ తలను గోడకు వేసి రాయడం, ఎదురుగా వచ్చేది ఏదైనా చూడకుండా కొమ్ములతో పొడవడానికి, నోటితో కొరికేందుకు ప్రయత్నిస్తాయి.
 
వ్యాక్సిన్ అందించే పద్ధతి..
 కాటుకు గురైన రోజు, మూడో రోజు, ఏడో రోజు, 14వ రోజు, 28వ రోజు, 60వ రోజు ఇలా క్రమం తప్పకుండా ఏడు డోసులు టీకాలు వేయించాలి. రెండు మూడు డోసులు వేయించి ఊరుకున్నా ప్రమాదమే. వర్షాకాలంలో అధికంగా కుక్కకాటుకు గురవుతుంటాయి. పశువుల పోషకులు సకాలంలో గమనించి వైద్యం అందించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement