
హైకోర్టు తీర్పును స్వాగతించిన ఎమ్మెల్యే ఆర్కే
సదావర్తి భూములకు సంబంధించి హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు.
హైదరాబాద్ : సదావర్తి భూములకు సంబంధించి హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. న్యాయస్థానం కీలక తీర్పు అనంతరం ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. కోర్టు తీర్పును గౌరవించి రూ.5 కోట్లను అదనంగా చెల్లిస్తామన్నారు. ప్రభుత్వ ఆస్తులను చంద్రబాబు నాయుడు కొల్లగొడితే చూస్తూ ఊరుకోమని ఎమ్మెల్యే ఆర్కే హెచ్చరించారు.
అన్యాక్రాంతం అయిన దేవాదాయ శాఖకు చెందిన మిగతా భూములపై కూడా తాము పోరాడతామన్నారు. చెన్నైకి సమీపంలో ఉన్న 100కోట్ల విలువ చేసే సదావర్తి భూములను చంద్రబాబు తన బినామీలకు 22 కోట్లకే కట్టబెట్టారని అన్నారు. ఈ విషయంలో తాము చేసిన న్యాయపోరాటం ఫలించిందని అన్నారు. కోర్టు తీర్పు ప్రకారం... అదనంగా 5కోట్ల రూపాయాలు చెల్లించి భూములను దక్కించుకుంటామన్నారు. కోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అని ఎమ్మెల్యే ఆర్కే ఎద్దేవా చేశారు.