హోదా వచ్చే వరకు జగన్ దీక్ష కొనసాగుతుంది | ysrcp leaders takes on chandrababu | Sakshi
Sakshi News home page

హోదా వచ్చే వరకు జగన్ దీక్ష కొనసాగుతుంది

Oct 5 2015 8:39 PM | Updated on Jul 28 2018 3:30 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యక హోదా వచ్చే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ దీక్ష కొనసాగుతుందని ఆ పార్టీ నేతలు కొత్తపల్లి సుబ్బారాయుడు, పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు.

ఏలూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యక హోదా వచ్చే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ దీక్ష కొనసాగుతుందని ఆ పార్టీ నేతలు కొత్తపల్లి సుబ్బారాయుడు, పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. సోమవారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో  కొత్తపల్లి సుబ్బారాయుడు, పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ... బ్రిటిష్ వారి పాలన కంటే చంద్రబాబు పాలన దారుణంగా ఉందని ఆరోపించారు.

తెలుగు ప్రజల ఆవేదన రూపమే వైఎస్ జగన్ దీక్ష అని పేర్కొన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం కనుకే ప్రత్యేక హోదా టీడీపీతోనే సాధ్యమని ఎన్నికల సమయంలో చెప్పారని వారు గుర్తు చేశారు. ఇప్పుడు ఎందుకు మాటమారుస్తున్నారని టీడీపీ నేతలను ఈ సందర్భంగా ప్రశ్నించారు. ప్యాకేజీలు కాదు, ప్రత్యేక హోదా మాత్రమే కావాలన్ని వారు డిమాండ్ చేశారు. టీడీపీ విధానాలనే బీజేపీ అమలు చేస్తుందా అనే అనుమానం కలుగుతోందని వారు చెప్పారు. దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని  కొత్తపల్లి సుబ్బారాయుడు, పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement