Sakshi News home page

మెమన్ మృతదేహం ఆసుపత్రికి తరలింపు

Published Thu, Jul 30 2015 8:57 AM

మెమన్ మృతదేహం ఆసుపత్రికి తరలింపు

నాగపూర్: నాగపూర్ కేంద్ర కారాగారంలో యాకుబ్ మెమన్కు ఉరి తీసిన అనంతరం అతడి మృతదేహన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి జైలు అధికారులు తరలించారు. అక్కడ యాకుబ్ మృతదేహనికి శవపరీక్ష నిర్వహిస్తారు. దీనిపై వైద్యులు పోలీసు ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తారు. ఆ తర్వాత యాకుబ్ మృతదేహన్ని అతడి బంధువులకు ఇవ్వవచ్చు... లేదా జైలు ప్రాంగణంలోనే అతడికి అంత్యక్రియలు నిర్వహించవచ్చు. ఆ అధికారం జైలు ఉన్నతాధికారులకు కలదు.

అయితే యాకుబ్ మృతదేహన్ని అతడి కుటుంబ సభ్యులకు అప్పగించకుండా... జైలు ప్రాంగణంలోనే ఖననం చేసేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టినట్లు సమాచారం. 1993లో ముంబై మహానగరంలో వరుస బాంబు పేలుళ్ల కేసులో యాకుబ్ మెమన్ నిందితడి తేలడంతో కోర్టు అతడికి ఉరిశిక్ష విధించింది. సదరు శిక్షను గురువారం ఉదయం 7.00 గంటలకు మహారాష్ట్రలోని నాగపూర్ జైలులో ఉరి తీసిన సంగతి తెలిసిందే.

Advertisement

What’s your opinion

Advertisement