రెడ్‌మి 3ఎస్ వచ్చేస్తోంది! | xiaomi to release redmi 3s phone in indian market | Sakshi
Sakshi News home page

రెడ్‌మి 3ఎస్ వచ్చేస్తోంది!

Aug 2 2016 12:22 PM | Updated on Sep 4 2017 7:30 AM

రెడ్‌మి 3ఎస్ వచ్చేస్తోంది!

రెడ్‌మి 3ఎస్ వచ్చేస్తోంది!

చైనా యాపిల్‌గా పేరొందిన షియోమి రెడ్‌మి సిరీస్‌లో మరో కొత్త ఫోన్ వచ్చేస్తోంది.

చైనా యాపిల్‌గా పేరొందిన షియోమి రెడ్‌మి సిరీస్‌లో మరో కొత్త ఫోన్ వచ్చేస్తోంది. తొలుత రెడ్‌మి 1ఎస్, తర్వాత 2ఎస్‌లను రిలీజ్ చేసిన ఈ సంస్థ.. తాజాగా రెడ్‌మి 3ఎస్ ఫోన్‌ను తీసుకొస్తోంది. ఈ కొత్త ఫోన్ బుధవారమే భారతీయ మార్కెట్లలోకి వచ్చేస్తోంది. ఈ కొత్త ఫోన్ ధర రూ. 10వేల లోపే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే కంపెనీ మాత్రం దీని ధర ఎంతో ఇంకా చెప్పలేదు. రెడ్‌మి సిరీస్‌లో 2, 2ప్రైమ్ తర్వాత వస్తు్న్న ఈ ఫోన్‌ను తొలుత చైనా మార్కెట్లో విడుదల చేశారు. 
 
ఫోన్ ఫీచర్లు ఇవీ..
ప్రాసెసర్ - క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 430
ర్యామ్ - 2 జీబీ
స్క్రీన్ - 5 అంగుళాల డిస్‌ప్లే
వెనక కెమెరా - 13 మెగాపిక్సెల్
సెల్ఫీ కెమెరా - 5 మెగాపిక్సెల్
బ్యాటరీ - 4100 ఎంఏహెచ్
ఇంటర్నల్ మెమొరీ - 16 జిబి
ఆండ్రాయిడ్ వెర్షన్ - 5.1 లాలిపాప్

Advertisement
 
Advertisement
Advertisement