5 నెలల కనిష్టానికి డబ్ల్యుపిఐ | Sakshi
Sakshi News home page

5 నెలల కనిష్టానికి డబ్ల్యుపిఐ

Published Wed, Dec 14 2016 12:49 PM

WPI inflation falls to 5-month low of 3.15% in November

ముంబై:  టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం నవంబర్లో  5 నెలల కనిష్ట స్థాయికి  దిగివచ్చింది.  టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) 3.15 శాతంగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో -2.04శాతంతో పోలిస్తే నవంబర్ నెలలో 3.15వద్ద నిలిచిందని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. అక్టోబర్లో ఇది 3.39శాతం గా ఉంది.
 నవంబర్ నెలలో 'ఆల్ కమోడిటీస్'   అధికారిక డబ్ల్యుపిఐ 0.1శాతం ఎగిసింది 183.1 (తాత్కాలిక) కు మునుపటి నెలలో 182.9 (తాత్కాలిక) నుండి పెరిగింది. ప్రాథమిక వస్తువుల సూచి 0.9 శాతం తగ్గివంది.మునుపటి నెలలో 261.8 (ప్రొవిజనల్) శాతంతో పోలిస్తే 259.4 శాతానికి తగ్గింది.తయారుచేయబడ్డ ఉత్పత్తుల సూచి నవంబర్లో 0.3శాతం  పెరిగి157.9 గా నమోదైందని  మంత్రిత్వ శాఖ తెలిపింది.
మరోవైపు రిటైల్‌ ద్రవ్యోల్బణం నవంబరులో రెండేళ్ల కనిష్ఠానికి దిగొచ్చి  3.63 శాతంగా నమోదైంది. అక్టోబరులో ఇది 4.20 శాతం ఉంది. పెద్ద నోట్ల రద్దు అనంతరం తలెత్తిన నగదు కొరత వల్ల వినియోగదారుల నుంచి డిమాండ్‌ గణనీయంగా తగ్గింది. దీంతో కూరగాయలతో పాటు పలు ఆహార వస్తువుల ధరలు చౌకగా మారడం ఇందుకు కలిసొచ్చింది. 2014 నవంబర్‌లో 3.23 శాతంగా నమోదైన తర్వాత రిటైల్‌ ద్రవ్యోల్బణానికి ఇదే కనిష్ఠ స్థాయి. 2015 ఆగస్టులో 3.66 శాతానికి చేరిన ద్రవ్యోల్బణం.. ఆ తర్వాత మళ్లీ పెరిగింది. 2015 నవంబరులో ఇది 5.41 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే.
 

Advertisement
Advertisement