
కోహ్లీ ఇంట్రెస్టింగ్ మెసేజ్ విత్ ఫోటో..
వరుస సిరీస్ విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రేమికుల రోజును లేట్‌గా నైనా లేటెస్ట్‌గా ఎంజాయ్ చేస్తున్నాడు.
న్యూఢిల్లీ: వరుస సిరీస్ విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రేమికుల రోజును లేట్‌గా నైనా లేటెస్ట్‌గా ఎంజాయ్ చేస్తున్నాడు. అవును..ఇప్పటివరకు ప్రియురాలు, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్కకు వాలెంటైన్స్ డే మెసేజ్ ను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఆటతోపాటు తనకు అనుష్క కూడా ఎంత ఇంపార్టెంటో చెప్పకనే చెప్పాడు కోహ్లి. ఇద్దరూ కలిసి దిగిన ఓ సెల్ఫీని తొలిసారిగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు అంతేకాదు.మనం ఫీల్ అయితే... ప్రతి రోజు వాలెంటైన్స్ డే నే ..నా ప్రతిరోజును నువ్వు అలా మార్చేశావ్.. అంటూ అనుష్కనుద్దేశించి కమెంట్ చేశాడు. దీంతో అటు అనుష్క మాత్రమే కాదు.. ఇటు కూడా ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.. లేట్ గా అయినా భలే కవరింగ్ ఇచ్చాడుగా.. ముద్దుగుమ్మకి అని అభిమానులు మురిసిపోతున్నారు.
టీమ్ ఇండియా క్రేజీ కెప్టెన్ పోస్ట్ చేసిన ఈ ప్రేమ సందేశం క్షణాల్లో వైరల్ గా వ్యాఫించింది. లైక్స్, కామెంట్స్ కుప్పలు తెప్పలుగా రావడం విశేషం. ఇద్దరూ కలిసున్న ఫొటోను విరాట్ తొలిసారి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. గతేడాది విడిపోయి మళ్లీ కలిసిన తర్వాత విరాట్ ఇంత ఓపెన్‌గా ఇద్దరి ఫొటోను పోస్ట్ చేయడం ఇదే తొలిసారి. వరుస హోమ్ సిరీస్‌లతో బిజీబిజీగా గడుపుతున్న విరాట్‌కు వాలెంటైన్స్ డేను సెలబ్రేట్ చేసుకునే టైమ్ కూడా దక్కలేదు. అటు అనుష్క కూడా ఫిల్లౌరీ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి.. కోహ్లీ మెసేజ్ పై అమ్మడుఎలా స్పందిస్తుందో చూడాలి.