బిజినెస్ బ్యూరో: విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా....
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా.. విజయవాడ-ఢిల్లీ మార్గంలో డెరైక్ట్ సర్వీసును జనవరి 15 నుంచి ప్రారంభిస్తోంది. ఏఐ459 విమానం ఢిల్లీలో ఉదయం 6.20కి బయల్దేరి విజయవాడకు 8.25కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఏఐ460 విమానం 9 గంటలకు బయల్దేరి ఢిల్లీకి 11.05కు చేరుకుంటుంది.
ఇప్పటికే హైదరాబాద్ మీదుగా ఢిల్లీ-విజయవాడ మధ్య ప్రతిరోజు ఒక సర్వీసు నడుస్తోంది. ఢిల్లీ నుంచి బ్యాంకాక్, బర్మింగ్‌హాం, ఫ్రాంక్‌ఫర్ట్, ఖాట్మండు, లండన్, మెల్‌బోర్న్, సిడ్నీ, ప్యారిస్, రోమ్, మిలన్‌లకు వెళ్లే విమానాలకు కనెక్ట్ అయ్యేందుకు కొత్త సర్వీసు దోహదం చేస్తుందని ఎయిర్ ఇండియా తెలిపింది.