
నాపై కక్ష సాధింపు: వాద్రా
రాజకీయ కక్ష సాధింపులో బలిపశువునవుతున్నానని ఆదివారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాఅల్లుడు రాబర్ట్ వాద్రా వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీ: రాజకీయ కక్ష సాధింపులో బలిపశువునవుతున్నానని ఆదివారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాఅల్లుడు రాబర్ట్ వాద్రా వ్యాఖ్యానించారు. తనను రాజకీయ పావుగా ఉపయోగించుకుంటున్నారన్నారు. వాద్రా కంపెనీలకు భూ కేటాయింపు వ్యవహారంపై రాజస్తాన్, హర్యానా రాష్ట్రాల్లో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. అందరిలా వ్యాపారం చేసుకుంటున్న వ్యక్తిగా, ప్రియాంక గాంధీ భర్తగా రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తిగా, వేర్వేరుగా తనను గుర్తించాలన్నారు. తనకింతవరకు ఈడీ సహా ఏ విచారణ సంస్థ నుంచి నోటీసులు అందలేదని, అందిన తరువాత న్యాయపరంగా పోరాడుతానన్నారు.