గజేంద్ర కుటుంబానికి రూ.5 లక్షల సాయం | UP CM announces Rs 5 lakh compensation for Gajendra Singh family | Sakshi
Sakshi News home page

గజేంద్ర కుటుంబానికి రూ.5 లక్షల సాయం

Apr 24 2015 11:48 AM | Updated on Sep 3 2017 12:49 AM

భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహించిన ర్యాలీలో ఆత్మహత్యకు పాల్పడిన రాజస్థాన్ రైతు గజేంద్ర సింగ్ కుటుంబానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సాయం ప్రకటించారు

లక్నో: భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహించిన ర్యాలీలో ఆత్మహత్యకు పాల్పడిన రాజస్థాన్ రైతు గజేంద్ర సింగ్ కుటుంబానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సహాయం ప్రకటించారు. పార్టీ తరుపున అతడి కుటుంబానికి రూ.5 లక్షల సాయం అందించనున్నట్లు శుక్రవారం తెలియజేశారు. గజేంద్ర మరణం తనను ఎంతో బాధించిందని, అతడి మరణంపట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నానని చెప్పారు. దేశంలో రైతులు సంక్షభ పరిస్థితిని ఎదుర్కొంటున్నారని చెప్పిన ఆయన అకాల వర్షాల కారణంగా వారు మరింత ప్రమాదంలో పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆత్మహత్యల నివారణకు కలిసి కట్టుగా కృషిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement