ఐఎన్ఎస్ సింధురత్న జలాంతర్గామి ప్రమాదంలో అదృశ్యమైన ఇద్దరు నేవీ అధికారులు కపీష్ మువాల్, మనోరంజన్ కుమార్ మరణించినట్లు నౌకాదళం నిర్ధారించింది.
ఐఎన్ఎస్ సింధురత్న జలాంతర్గామి ప్రమాదంలో అదృశ్యమైన ఇద్దరు నేవీ అధికారులు కపీష్ మువాల్, మనోరంజన్ కుమార్ మరణించినట్లు నౌకాదళం నిర్ధారించింది. ఈ జలాంతర్గామి నుంచి పొగ రావడంతో.. ఐదుగురు సిబ్బంది అస్వస్థతకు గురికాగా, మరో ఇద్దరు కనపడకుండా పోయిన విషయం తెలిసిందే. వారిద్దరూ మరణించిన విషయాన్ని నౌకాదళం గురువారం నాడు నిర్ధారించింది.
వరుస పెట్టి జలాంతర్గాములలో ప్రమాదాలు సంభవిస్తుండటంతో తీవ్రంగా కలత చెందిన నౌకా దళాధిపతి అడ్మిరల్ డీకే జోషి రాజీనామా చేశారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని కూడా ఆయన రక్షణ మంత్రి ఏకే ఆంటోనీని కోరారు.