చెన్నై విమానాశ్రయంలో ఇద్దరి అరెస్ట్ | two held in chennai airport with fake passport | Sakshi
Sakshi News home page

చెన్నై విమానాశ్రయంలో ఇద్దరి అరెస్ట్

Jun 28 2015 11:13 PM | Updated on Sep 3 2017 4:32 AM

నకిలీ పాస్‌పోర్టుతో విదేశాలకు వెళ్లడానికి ప్రయత్నించిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలిలా ఉన్నాయి..

తిరువొత్తియూరు (చెన్నై): నకిలీ పాస్‌పోర్టుతో విదేశాలకు వెళ్లడానికి ప్రయత్నించిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలిలా ఉన్నాయి. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆదివారం తెల్లవారుజామున దుబాయ్‌కు వెళ్లేందుకు ఓ విమానం సిద్ధంగా ఉంది. అందులో ప్రయాణించుటకు వచ్చిన ప్రయాణికులను పాస్‌పోర్టు తనిఖీ అధికారులు తనిఖీ చేశారు. ఆ సమయంలో అరందాంగికి చెందిన మహ్మద్ కలింజియం అనే వ్యక్తికి చెందిన పాస్‌పోర్టును తనిఖీ చేయగా అది నకిలీదని తేలింది.

దీంతో అతన్ని ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు. అలాగే ఇక్కడ్నుంచి శనివారం రాత్రి శ్రీలంకకు వెళ్లే విమానంలో ప్రయాణించుటకు వచ్చిన వారిలో చెన్నై ఆలపాక్కంకు చెందిన దేనిష్ (26) అనే యువకుని పాస్‌పోర్టు నకిలీదని తెలిసింది. దీంతో అతన్ని కూడా ఎయిర్‌పోర్టు పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement