శనివారం సాయంత్రానికి భారత్ జనాభా 127,42,39,769 | total number of the population of India | Sakshi
Sakshi News home page

శనివారం సాయంత్రానికి భారత్ జనాభా 127,42,39,769

Jul 12 2015 1:59 AM | Updated on Sep 3 2017 5:19 AM

శనివారం సాయంత్రం సరిగ్గా ఐదుగంటలకు భారతదేశ జనాభా మొత్తం సంఖ్య ఇది.

న్యూఢిల్లీ: న్యూఢిల్లీ: శనివారం సాయంత్రం సరిగ్గా ఐదుగంటలకు  భారతదేశ జనాభా మొత్తం సంఖ్య ఇది. ప్రపంచ జనాభా దినం సందర్భంగా జాతీయ జనాభా కమిషన్, అమెరికా గణాంకాల సంస్థల సంయుక్త సమాచారం ఆధారంగా ఇండియాస్టాట్.కామ్  ఈ వివరాలను వెల్లడించింది. మొత్తం ప్రపంచ జనాభాలో 17.25 శాతం మంది భారత్‌లోనే నివసిస్తున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ప్రతి ఏటా భారత జనాభా 1.6శాతం చొప్పున పెరుగుతోంది. ప్రస్తుతం చైనాలో 139కోట్ల జనాభా ఉందని, అయితే ఇంతటి వృద్ధిరేటుతో దూసుకెళ్తే 2050నాటికి 169కోట్ల జనాభాతో ప్రపంచంలోనే ఎక్కువ జనాభా ఉన్న దేశంగా భారత్ ప్రథమస్థానంలో నిలువనుంది.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement