నేడు ‘గ్రామజ్యోతి’కి శ్రీకారం | today start the grama joyti program | Sakshi
Sakshi News home page

నేడు ‘గ్రామజ్యోతి’కి శ్రీకారం

Aug 17 2015 3:52 AM | Updated on Aug 14 2018 10:54 AM

నేడు ‘గ్రామజ్యోతి’కి శ్రీకారం - Sakshi

నేడు ‘గ్రామజ్యోతి’కి శ్రీకారం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం ఉదయం 10.30 గంటలకు వరంగల్ జిల్లా గంగదేవిపల్లిలో ప్రారంభించనున్నారు.

గంగదేవిపల్లిలో ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం ఉదయం 10.30 గంటలకు వరంగల్ జిల్లా గంగదేవిపల్లిలో ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి హరితహారం నిర్వహిస్తారు. గ్రామకమిటీ ల ద్వారా గంగదేవిపల్లిలో జరిగిన అభివృద్ధిని ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. అనంతరం గ్రామసభలో పాల్గొంటారు. తర్వాత నల్లబెల్లి మండలం మేడిపల్లిలో నిర్వహించనున్న రాంపూర్-మేడిపల్లి జంట గ్రామాల గ్రామసభలో పాల్గొంటారు.

తన గ్రామాభివృద్ధికి రూ. 50 లక్షలను విరాళంగా ఇచ్చిన రాంపూర్‌వాసి, యశోద హాస్పిటల్స్ అధిపతి గోరుకంటి సురేందర్‌రావును సీఎం కేసీఆర్ అభినందించనున్నారు. అలాగే, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌లో గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారు దత్తత తీసుకున్న గ్రామాల్లోనే సోమవారం గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement