వాచీ కావాలా నాయనా.. | The Ratners repairman who makes the world's most exclusive watches | Sakshi
Sakshi News home page

వాచీ కావాలా నాయనా..

Mar 5 2014 5:58 AM | Updated on Sep 2 2017 4:23 AM

వాచీ కావాలా నాయనా..

వాచీ కావాలా నాయనా..

అయితే, 8 ఏళ్లు ఆగాల్సిందే.. ఈయనతో వాచీ తయారుచేయించుకోవాలంటే అన్నేళ్లు వెయిట్ చేయాల్సిందే.. అంతేకాదు.. వాచీకి రూ. 80 లక్షల నుంచి 5 కోట్లు వెచ్చించాల్సిందే..

అయితే, 8 ఏళ్లు ఆగాల్సిందే.. ఈయనతో వాచీ తయారుచేయించుకోవాలంటే అన్నేళ్లు వెయిట్ చేయాల్సిందే.. అంతేకాదు.. వాచీకి రూ. 80 లక్షల నుంచి 5 కోట్లు వెచ్చించాల్సిందే.. ఈయనకున్న పేరుప్రఖ్యాతులు అలాంటివి మరి. బ్రిటన్‌కు చెందిన ఈ వాచీ తయారీదారు పేరు రోజర్ డబ్ల్యూ స్మిత్. అత్యుత్తమ వాచీలను తయారుచేస్తాడన్నది ఈయనకున్న పేరు. వాచీ తాలూకు బెల్ట్, రెండు స్ప్రింగ్‌లు తప్ప.. అందులోని మిగిలిన పరికరాలన్నీ ఈయనే స్వయంగా తయారుచేస్తాడు.
 
 అదీ చాలా జాగ్రత్తగా.. మన్నికగా ఉండేలా తీర్చిదిద్దుతాడు. అందుకే ఏడాదికి 10 గడియారాలను మాత్రమే తయారు చేయ గలుగుతున్నాడు. అది ఈ మధ్య నుంచే.. గతంలో అయితే.. ఒకటో రెండో చేసేవాడు. అందుకే.. ఇప్పటివరకూ రోజర్ తయారుచేసిన వాచీలను ధరించే భాగ్యం కూడా ప్రపంచంలో 50 మందికి మాత్రమే కలిగింది. ఎంత లేట్‌గా చేస్తేనేం.. మాకు నాణ్యత ముఖ్యం అనుకుంటున్నారు కాబట్టే.. చాలా మంది ప్రముఖులు రోజర్ వాచీల కోసం క్యూ కట్టారు. అందుకే 8 ఏళ్లు వరకూ ఆయనకు ఖాళీ లేదు. ఎవరికైనా వాచీ కావాలంటే ఆ తర్వాతే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement