లోక్సభ ఎన్నికల్లో పరాజయం పాలైన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి గోడు వెళ్లబోసుకున్నారు.
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో పరాజయం పాలైన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి గోడు వెళ్లబోసుకున్నారు. తెలంగాణలో పార్టీ ఓటమి గల కారణాలను ఏకరువు పెట్టారు.
ప్రత్యేక రాష్ట్రం ఇస్తే పార్టీకి ఎక్కువ సీట్లు తీసుకొస్తామన్న హామీని నిలబెట్టుకోలేకపోయామని సోనియా వద్ద మాజీ ఎంపీలు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చినందుకు సోనియాకు కృతజ్ఞతగా అపాయింటెడ్ డే రోజున వేడుకలు జరుపుతామని అధినేత్రిని కోరారు. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చినప్పటికీ ఈ ప్రాంతంలో ఆపార్టీ రెండు ఎంపీ స్థానాల మాత్రమే గెల్చుకుంది.