టీడీపీ నేతలే సూత్రధారులు! | tdp leaders are behind sex rocket | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతలే సూత్రధారులు!

Dec 18 2015 2:30 AM | Updated on Aug 10 2018 8:16 PM

టీడీపీ నేతలే సూత్రధారులు! - Sakshi

టీడీపీ నేతలే సూత్రధారులు!

అక్రమాలు బయటపడ్డ ప్రతిసారీ చంద్రబాబు వేళ్లు ప్రత్యర్థులవైపే చూపిస్తాయి.

కాటేసిన ‘కాల్’ నాగులు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: అక్రమాలు బయటపడ్డ ప్రతిసారీ చంద్రబాబు వేళ్లు ప్రత్యర్థులవైపే చూపిస్తాయి. తనపైనా, టీడీపీ నేతలపైనా ఆరోపణలు వచ్చినప్పుడు ఎదురుదాడి చేయడం ఆయన నైజం. అదే పంథాను ‘మనీ-సెక్స్’ రాకెట్‌లోనూ బాబు అవలంభిస్తున్నారు. కాల్‌మనీ ముఠా సాగించిన అకృత్యాలు వెలుగులోకి వచ్చిన వెంటనే కఠినచర్యలకు ఆదే శించాల్సిన ఏపీ ముఖ్యమంత్రి.. ఆ పని చేయకుండా విపక్షాలను ఆ బురదలోకి లాగే ప్రయత్నం చేస్తూ ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. విజయవాడ సెక్స్ రాకెట్ కేసులో పోలీసులు నిందితులుగా పేర్కొన్న ఏడుగురిలో ఐదుగురు తెలుగుదేశం పార్టీకి చెందినవారు లేదా ఆ పార్టీ నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నవారే అయినప్పటికీ.. వాస్తవాన్ని అంగీకరించకుండా ఎప్పటిలాగే అడ్డంగా బుకాయిస్తున్నారు. ఈ కేసులో నిందితులు కొందరికి టీడీపీతో సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పేందుకు మచ్చుకు కొన్ని రుజువులు..

     * కాల్‌మనీ సెక్స్ రాకెట్‌లో ఏ1 (మొదటి) నిందితుడు యలమంచిలి శ్రీరామమూర్తి (రాము). ఇతనికి టీడీపీ నగర నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఎమ్మెల్యే బోడె ప్రసాద్ గెస్ట్‌హౌస్‌లో జరిగిన ఒక పార్టీయే ఇందుకు నిదర్శనం. ఈ వేడుకకు తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరయ్యారు. ఏ1 రాము కూడా ఇందులో పాల్గొనడం, రామ్మోహన్‌కు ఒకవైపున నిలబడి ఫొటో కూడా దిగడం తెలుగుదేశం పార్టీతో, ఆ పార్టీ నేతలతో రాముకున్న సన్నిహిత సంబంధాన్ని స్పష్టం చేస్తోంది.

     * ఏ2 గా ఉన్న భవానీ శంకర్ బౌన్సర్. ఇతను.. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అనుచరుడైన కార్పొరేటర్ ఆత్కూరి రవికుమార్‌కు అత్యంత సన్నిహితుడు. కాగా శంకర్ బాగా ఖరీదైన జాగ్వార్ (ఏపీ 16డీఏ 5111) కారును ఉపయోగిస్తున్నట్టు.. ఆ కారుతో అతను దిగిన ఫొటోలు స్పష్టం చేస్తున్నాయి. ఈ కారును శంకర్‌కు రవికుమార్ ఇచ్చాడని చెబుతున్నారు. ఎంత సన్నిహితుడు కాకపోతే అంతటి ఖరీదైన కారు ఇస్తాడని అంటున్నారు.

    * నాలుగో నిందితుడు సత్యానందంకు నేరుగా చంద్రబాబుతోనే సత్సంబంధాలు ఉన్నాయనే విషయం ఇప్పటికే స్పష్టమయ్యింది. ఆయన చంద్రబాబుతోనూ, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ ఏబీ వెంకటేశ్వరరావుతోనూ కలసి దిగిన ఫొటోలు కూడా వెలుగుచూశాయి. చంద్రబాబుతో, టీడీపీతో ఉన్న సత్సంబంధాల కారణంగానే సత్యానందం గతంలో నందిగామ టిక్కెట్ కోసం ప్రయత్నించారు.

    * ఏ5 వెనిగళ్ల శ్రీకాంత్‌కు టీడీపీ పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌తో ఎంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. శ్రీకాంత్‌తో కలసి ప్రసాద్ గతంలో పలుమారు విదేశీ పర్యటనలకు వెళ్లారు. తాజాగా మనీ-సెక్స్ రాకెట్ వెలుగులోకి వచ్చినప్పుడు కూడా వీరిద్దరూ విదేశంలోనే ఉన్నారు. బ్యాంకాక్‌లో ఇద్దరూ కలసి దిగిన ఫొటోలు కూడా హల్‌చల్ చేశాయి. అంతేకాదు శ్రీకాంత్ తెలుగుదేశం పార్టీ ముఖ్య కార్యకర్త అని, పార్టీ కార్యక్రమాలన్నిటిలో చురుగ్గా పాల్గొంటాడని తెలిసింది.

   * ఆరో నిందితుడు పెండ్యాల శ్రీకాంత్  కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్య కార్యకర్త కావడం గమనార్హం.. కాగా ఏడో నిందితుడు దూడల రాజేశ్ గతంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయినా ప్రస్తుతం రాము బ్యాచ్‌లోనే ఉన్నాడని, టీడీపీ నేతలతో సంబంధాలు కొనసాగిస్తున్నాడని సమాచారం ఉంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement