ఎలాంటి మొగుడు కావాలంటే.. | Taapsee Pannu Interview | Sakshi
Sakshi News home page

ఎలాంటి మొగుడు కావాలంటే..

Oct 29 2015 11:11 AM | Updated on Apr 3 2019 9:17 PM

ఎలాంటి మొగుడు కావాలంటే.. - Sakshi

ఎలాంటి మొగుడు కావాలంటే..

ప్రతి యువతీ తనకు కాబోయే భర్త అలా ఉండాలి, ఇలా ఉండాలి అంటూ కలలు కనడం సహజం.

చెన్నై: ప్రతి యువతీ తనకు కాబోయే భర్త అలా ఉండాలి, ఇలా ఉండాలి అంటూ కలలు కనడం సహజం. ఇక నటి తాప్సీ తనకు కాబోయే జీవిత భాగస్వామి ఎలాంటి వాడై ఉండాలన్న విషయమై చాంతాడంత సాగదీసి చెప్పింది. ఆడుగళం చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమలోకి తెరంగేట్రం చేసిన ఈ ఉత్తరాది భామ ఆ తరువాత వందాన్ వెండ్రాన్, ఆరంభం, కాంచన-2, వై రాజావై తదితర చిత్రాల్లో నటించింది. తెలుగు, హిందీ భాషల్లోనూ నటిస్తున్న తాప్సీ మొగుడు అనే తెలుగు చిత్రంలో అట్టాంటి మొగుడు ఇట్టాంటి మొగుడు అంటూ ఏకంగా ఒక పాటే పాడేసుకుంది. కాగా ఈ ముద్దుగుమ్మ పెళ్లికి రెడీ అయ్యిందనీ, ఇంట్లో వరుడి వేట ముమ్మరంగా సాగుతోందని ప్రచారం హల్‌చల్ చేస్తోంది. ఈ వ్యవహారం గురించి, తనకు కాబోయే మొగుడి గురించి ఇంకా వ్యక్తిగత విషయాల గురించి ఎలా స్పందించిందో చూద్దాం!
 
 ఏ విషయంలోనూ  ప్రశ్నించకూడదు
 నేను వివాహం చేసుకోబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. నిజం చెప్పాలంటే నేనింకా పెళ్లికి సిద్ధం కాలేదు. అయినా నా కెలాంటి మొగుడు కావాలన్న విషయంలో నాకంటూ కొన్ని కోరికలు ఉన్నాయి. వాటిని మీరు ఆంక్షలు అనుకున్నా పర్వాలేదు. నన్ను పెళ్లి చేసుకునే వాడు నన్ను గౌరవించే వాడై ఉండాలి. ముఖ్యంగా నా స్వేచ్ఛకు భంగం కలిగించకూడదు. ఏ విషయంలోనూ నన్ను ప్రశ్నించకూడదు. నా ఇష్టం వచ్చినట్లు జీవించడానికి స్వతంత్రం ఇవ్వాలి. ఏ విషయంలోనూ అడ్డు చెప్పకూడదు. అలాగే ఏ విషయంలోనైనా నిర్ణయాన్ని నేనే తీసుకోవాలి. అసలు సినిమాకు చెందిన వారినే వివాహం చేసుకోను. వివాహానంతరం తమ కుటుంబంలో ఒక సినిమా నక్షత్రం ఉండాలి. అది నేనే అయ్యి ఉండాలి.
 
 నాతో సాహవాసం చేయవద్దనేవారు
 పాఠశాల, కళాశాలల్లో చదివేటప్పుడు నేను చాలా గడుగ్గాయిననే చెప్పాలి. ఉదయం ఏడు గంటలకు ఇంటి నుంచి బయటపడ్డానంటే రాత్రి 10 గంటలకే తిరిగి చేరేదాన్ని. గ్రామాల్లో వీధి ఆటల్లో నేను ఎక్స్‌పర్ట్‌ని. చాలా బహుమతుల్ని గెలుసుకున్నాను. అప్పట్లో మగ పిల్లల్ని వారి తల్లిదండ్రులు నాదరి చేరనిచ్చేవారుకాదు. నన్ను చూపించి అదుగో ఆ అమ్మాయి అదో మాదిరి తనతో సావాసం చేయవద్దు అని చెప్పేవారు. అలాంటి వారే ఇప్పుడు నన్ను పిలిచి తమ పిల్లలకు బుద్ధి చెప్పమని అడుగుతున్నారు. ఇది నాకు లభించిన విజయంగా భావిస్తున్నాను. ప్రస్తుతం నటిగా హ్యాపీగా ఉన్నాను. ఇటీవల సోదరితో కలిసి వివాహ సంబంధాల సంస్థను ప్రారంభించాను. దీంతో నటనకు స్వస్తి చేప్పనున్నట్లు వదంతులు హల్‌చల్ చేస్తున్నాయి. అదంతా ఉత్తదే. నేను నటనకు దూరమయ్యే ప్రసక్తే లేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement