ఇంజనీర్ను అపహరించిన మావోయిస్టులు | Suspected Maoists abduct engineer | Sakshi
Sakshi News home page

ఇంజనీర్ను అపహరించిన మావోయిస్టులు

Feb 15 2014 9:49 AM | Updated on Oct 9 2018 2:39 PM

జార్ఖండ్ రాజధాని రాంచీలో ఇంజనీర్ పంకజ్ కుమార్ను మావోయిస్టులు అపహరించుకుపోయారు.

జార్ఖండ్ రాజధాని రాంచీలో ఇంజనీర్ పంకజ్ కుమార్ను మావోయిస్టులు అపహరించుకుపోయారు. రాంచీ జిల్లాలోని సుమండి గ్రామంలో నిర్మిస్తున్న వంతెనను పరిశీలించేందుకు ఆయన శుక్రవారం వెళ్లారు. అనంతరం ఆయన అక్కడి నుంచి రాంచీకి వాహనంలో తిరుగు ప్రయాణమైయ్యారు.

 

ఆ క్రమంలో పంకజ్ కుమార్ ప్రయాణిస్తున్న వాహనాన్ని మావోయిస్టులు అడ్డగించి, పంకజ్ కుమార్ను మారణాయుధాలతో బెదిరించి తమతోపాటు అడవిలోకి తీసుకువెళ్లారని జిల్లా పోలీసు ఉన్నతాధికారి భీమ్సేన్ టుటీ వెల్లడించారు. పంకజ్ కుమార్ కోసం గాలింపు చర్యలు తీవ్రతరం చేసినట్లు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement