స్పైస్ జెట్ దూకుడు | SpiceJet hits 9-year high; up over 60% in less than two months | Sakshi
Sakshi News home page

స్పైస్ జెట్ దూకుడు

Mar 27 2017 1:28 PM | Updated on Aug 25 2018 5:10 PM

భారతీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ సోమవారం నాటి మార్కెట్లో దూసుకుపోయింది. ఇంట్రా డేలో స్పైస్‌జెట్‌ షేరు ధర 9 ఏళ్ల గరిష్టాన్ని తాకింది.

ముంబై: భారతీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ సోమవారం నాటి మార్కెట్లో దూసుకుపోయింది.  ఇంట్రా డేలో ఈ  కౌంటర్‌ లో కొనుగోళ్ల జోరు నెలకొంది. దీంతో  స్పైస్‌ జెట్‌  షేరు ధర 9ఏళ్ల గరిష్టాన్ని తాకింది.   బీఎస్‌ఈలో రూ. 101 వద్ద ట్రేడ్‌ అవుతూ , 2008 జనవరి 9 తొలిసారి ఈ స్తాయిని తాకింది.  చమురు ధరల పతనానికి తోడు ఇటీవల కోల్‌కతా-ఢాకా, ఢిల్లీ-సూరత్‌ల మధ్య రోజువారీ డైరెక్ట్‌ సర్వీసులను ప్రారంభించడంతో స్పైస్‌జెట్‌ కౌంటర్‌ జోరందుకున్నట్లు ఎనలిస్టులు  చెబుతున్నారు.

గత రెండు నెలలకంటే తక్కువ కాలంలోనే  ఈ కౌంటర్‌ 60 శాతం దూసుకెళ్లింది. ఫిబ్రవరి 15, 2017న  స్పైస్‌ జెట్‌ షేరు ధర రూ. 60 గా ఉంది.  2005 సెప్టెంబర్‌ లో రూ. 115 ఆల్‌ టైం హైని తాకింది.  దీంతో మిగిలిన ఎయిర్‌ లైన్స్‌ కూడా ఈ బాటలో పయనిస్తున్నాయి.  ఇండిగో సర్వీసుల సంస్థ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌  లాభాలనార్జిస్తున్నాయి. 

ఫిబ్రవరి మాసంలో పాసింజర్‌  ట్రాఫిక్‌ లో నెలకొన్న దృఢమైన వృద్ధి, చమురు ధరలు, బలహీనపడుతున్న డాలర్‌  విలువ  నేపథ్యంలో  ఏవియేషన్‌ స్టాక్స్‌ లో ర్యాలీకి దారి తీస్తోందని  బిజినెస్‌ స్టాండర్స్‌ నివేదించింది.   ఇంధన, నిర్వహణ, లీజు ఖర్చులు డాలర్‌ తోముడిపడివున్నాయనీ, దీంతో   రూపాయితో పోలిస్తే డాలర్‌బలహీనపడడం  ఎయిర్‌లైన్స్‌ లాభదాయకమని తెలిపింది. ముఖ్యంగా  అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరల క్షీణత, డాలర్‌ బలహీనత కారణంగా  విమానయాన  సెక్టార్‌కు జోష్‌ నిస్తోంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement