ఒకే రోజు ఆరుగురు రైతుల ఆత్మహత్య | Six farmers commit suicide in Vidarbha | Sakshi
Sakshi News home page

ఒకే రోజు ఆరుగురు రైతుల ఆత్మహత్య

Oct 23 2014 3:49 PM | Updated on Oct 1 2018 2:44 PM

విదర్భలో బుధవారం ఒకే రోజు ఆరుగురు రైతుల ఆత్మహత్యకు పాల్పడ్డారు.

నాగపూర్: విదర్భలో బుధవారం ఒకే రోజు ఆరుగురు రైతుల ఆత్మహత్యకు పాల్పడ్డారు. యావత్మాల్ జిల్లాలో నలుగురు అన్నదాతలు బలవన్మరణం పాలయ్యారు. అకోలా, అమరావతి జిల్లాల్లో ఒక్కొక్కరు ఆత్మహత్య చేసుకున్నారని విదర్భ జన ఆందోళన్ సమితి అధ్యక్షుడు కిశోర్ తివారి తెలిపారు.

తమ కష్టాలు తీరుస్తుందన్న ఆశతో కేంద్రం, మహారాష్ట్రలో బీజేపీకి ప్రజలు ఓటు వేశారని ఆయన తెలిపారు. రైతుల ఆత్మహత్యలు నివారించేందుకు బీజేపీ చర్యలు చేపట్టాలని కోరారు. విదర్భలో పర్యటించాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. జాతీయ నేర గణాంక విభాగం లెక్కల ప్రకారం విదర్భలో గతేడాది 3,146 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement