ఔను.. బ్రేకప్‌ అయింది: యువ హీరో | Sakshi
Sakshi News home page

ఔను.. బ్రేకప్‌ అయింది: యువ హీరో

Published Wed, Aug 23 2017 12:24 PM

ఔను.. బ్రేకప్‌ అయింది: యువ హీరో

సెలబ్రిటీల చుట్టూ గాసిప్‌లు కొత్త కాదు. నిత్యం ఏదో రకమైన వదంతి సినీ ప్రముఖుల చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. బాలీవుడ్‌ యువజంట సిద్ధార్థ్‌ మల్హోత్రా- అలియా భట్‌ డేటింగ్‌ చేస్తున్నట్టు ఎన్నోసార్లు కథనాలు వచ్చాయి. ఈ ఇద్దరు ప్రేమలో మునిగితేలినట్టు ఆ మధ్య వినిపించింది. ఆ తర్వాత ఏమైందో ఏమిటో తెలియదు కానీ వీరి మధ్య దూరం పెరిగింది. ఇదే విషయాన్ని సిద్ధార్థ్‌ పరోక్షంగా ధ్రువీకరించాడు. ఆలియా భట్‌తో బ్రేకప్ అయిన విషయాన్ని చెప్పకనే చెప్పాడు. నేహా ధూఫియా చాట్‌షో 'నో ఫిల్టర్‌ నేహా' కార్యక్రమంలో మాట్లాడిన సిద్ధార్థ్‌.. 'నేను ఎప్పుడు ఒంటరిగానే ఉన్నా' అని స్పష్టం చేశాడు.

ఆలియాతో రిలేషన్‌షిప్‌లో ఉన్న విషయాన్ని కూడా సిద్ధార్థ్‌ ఏ రోజు ధ్రువీకరించలేదు. కానీ సినీ పరిశ్రమలో మీకు బాగా నచ్చే వ్యక్తి ఎవరని నేహా అడిగితే.. వెంటనే ఆలియా పేరు చెప్పేశాడు. గతంలో ఈ యువ జంట చాలా సన్నిహితంగా పార్టీలు, వేడుకలకు హాజరైన సంగతి తెలిసిందే. 'ఆలియా నా కళ్లలోకి చూస్తుంది. నేను తన కళ్లలోకి చూస్తాను. ఇద్దరం ప్రపంచాన్ని మరిచిపోతాం. తను నాకు ఎంతో సన్నిహితురాలు. ఇప్పుడు నా జీవితంలో తను ఎంతో ముఖ్యమైన వ్యక్తి' అని సిద్ధార్థ్‌ గతంలో మీడియాతో పేర్కొన్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement