ముగిసిన సీమాంధ్ర కేంద్ర మంత్రుల సమావేశం | Seemandhra region central ministers met at Kavuri Sambasiva Rao's Residence | Sakshi
Sakshi News home page

ముగిసిన సీమాంధ్ర కేంద్ర మంత్రుల సమావేశం

Nov 5 2013 8:21 PM | Updated on Aug 15 2018 7:45 PM

కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు నివాసంలో మంగళవారం సాయంత్రం జరిగిన సీమాంధ్ర కేంద్ర మంత్రుల సమావేశం ముగిసింది.

కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు నివాసంలో మంగళవారం సాయంత్రం జరిగిన సీమాంధ్ర కేంద్ర మంత్రుల సమావేశం ముగిసింది. జీవోఎంకు నివేదిక ఇవ్వనున్న నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రలు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 
 
సమావేశం అనంతరం మంత్రులను మాట్లాడించేందుకు ప్రయత్నించగా మంత్రి జేడీ శీలం 'నో కామెంట్' అని వ్యాఖ్యానించగా,  కావూరి 'కాఫీ తాగాం' అని అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని మరోసారి మంత్రుల బృందాన్ని మరోసారి కలుస్తాం అని పనబాక లక్ష్మి తెలిపారు. రాష్ట్ర విభజన అంశంపై మళ్లీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, దిగ్విజయ్ సింగ్ లను కలుస్తామన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement