'పై-లిన్ భారీ నుంచి రేడియోనే కాపాడింది' | Radio saved lives during Phailin: Survivor | Sakshi
Sakshi News home page

'పై-లిన్ భారీ నుంచి రేడియోనే కాపాడింది'

Oct 20 2013 2:59 PM | Updated on Sep 1 2017 11:49 PM

రేడియోనే తనను,తన కుటుంబాన్ని పై లిన్ తుఫాన్ భారీ నుంచి రక్షించిందని ఒడిశాలోని పూరీ నివాసి గజేంద్ర జేనా వెల్లడించారు.

రేడియోనే తనను,తన కుటుంబాన్ని పై లిన్ తుఫాన్ భారీ నుంచి రక్షించిందని ఒడిశాలోని  పూరీ నివాసి గజేంద్ర జేనా ఆదివారం వెల్లడించారు.పై లిన్ తుపాన్పై రేడియోలో ఎప్పటికప్పుడు ప్రసారం అయిన బులిటెన్లతో తాము అప్రమత్తమైయ్యామని చెప్పారు.సముద్ర తీరానికి 5 కిలోమీటర్లలోపు నివసించేవారు తక్షణం సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని రేడియో ద్వారా తెలుసుకున్నానని తెలిపారు.

 

పై లిన్ తుపాన్ వల్ల ప్రచండవేగంతో ఈదురుగాలులు వీచాయి,భారీ వర్షాలు కురిశాయి.దాంతో తాను నివసించే ఇంటిపై కప్పు సిమెంట్ రేకులు గాలికి కొట్టుకుపోయాయి.దాంతో తమ కుటుంబానికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.రేడియోలో పై లిన్ తుపాన్పై వచ్చిన బులిటెన్ వినకుంటే ఇంటి సమీపంలోనే తలదాచుకుని ఉండేవారమని చెప్పారు.

 

దీంతో తాను తన కుటుంబ సభ్యుల ప్రాణాలు ఎప్పుడో అనంత వాయువుల్లో కలిసిపోయేవని తెలిపారు.రేడియోలో పై లిన్ తుపాన్ తీవ్రతను  ప్రసారం చేయడం ద్వారా  తాను తన భార్య ఇద్దరు పిల్లలతోపాటు రేడియో తీసుకుని పునరావాస కేంద్రానికి తరలినట్లు గజేంద్ర జేనా వెల్లడించారు.పై లిన్ తుపాన్ నుంచి తమ ప్రాణాలు రేడియోనే కాపాడిందని గజేంద్ర జేనా తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement