వైజాగ్‌ స్టీల్‌తో పోస్కో జట్టు!  | Posco team with Vizag Steel | Sakshi
Sakshi News home page

వైజాగ్‌ స్టీల్‌తో పోస్కో జట్టు! 

Sep 30 2019 3:48 AM | Updated on Sep 30 2019 3:48 AM

Posco team with Vizag Steel - Sakshi

న్యూఢిల్లీ: దక్షిణ కొరియా స్టీల్‌ దిగ్గజం పోస్కో మరోసారి భారత్‌ మార్కెట్లో అడుగు పెట్టేందుకు ప్రయత్నాలను మమ్మరం చేసింది. ప్రభుత్వరంగంలోని రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌/వైజాగ్‌ స్టీల్‌)తో జాయింట్‌ వెంచర్‌ కోసం సుముఖంగా ఉంది. గత వారం ఆర్‌ఐఎన్‌ఎల్‌ యాజమాన్యంతో పోస్కో అధికారి ఒకరు భేటీ అయి జాయింట్‌ వెంచర్‌ ప్రణాళికలపై చర్చించడం కూడా జరిగినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం ఆధారంగా తెలుస్తోంది. అంతేకాదు ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు మూడు సార్లు వైజాగ్‌ స్టీల్‌ను సందర్శించినట్టు సమాచారం.

విలువ ఆధారిత స్పెషల్‌ గ్రేడ్‌ స్టీల్‌ ఉత్పత్తుల కోసం ఆర్‌ఐఎన్‌ఎల్‌తో కలసి సంయుక్తంగా విశాఖలో ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలన్నది పోస్కో ఆలోచన.  గతంలో ఒడిశాలోని జగత్‌సింగ్‌పూర్‌లో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ప్రయత్నాలు కూడా చేసింది. ఇందుకోసం ఒడిశా ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది. అయితే, పర్యావరణ అనుమతుల్లో జాప్యం, స్థానికుల నుంచి నిరసన వ్యక్తం కావడంతో వెనక్కి తగ్గింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement