పాతబస్తీలోని పల్లె చెరువుకు గండి | Palle cheruvu flow water into patabasthi | Sakshi
Sakshi News home page

పాతబస్తీలోని పల్లె చెరువుకు గండి

Sep 29 2015 6:06 AM | Updated on Sep 3 2017 10:11 AM

పాతబస్తీలో బండ్లగూడ పల్లెచెరువుకు గండి పడింది.

హైదరాబాద్: పాతబస్తీలో బండ్లగూడ పల్లెచెరువుకు గండి పడింది. చెరువుకు గండి పడి రోడ్డుపైకి భారీగా నీరు వచ్చి చేరడంతో నాలుగు కిలోమీటర్ల వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. లోతట్టుప్రాంతాలు జలమయమైయ్యాయి. ఆలీనగర్ బస్తీ ఇళ్లు నీటమునిగాయి. మోకాళ్ల లోతులో బస్సు నీట మునగడంతో ప్రయాణికులు ఆర్తనాదాలు చేశారు.

స్థానికులు, పోలీసులు బస్సును ఒడ్డుకు చేర్చి ప్రయాణికులను రక్షించినట్టు తెలిసింది. దీనిపై అధికారులు సహాయక చర్యలు చేపట్టకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement