విదేశీ కంపెనీలూ.. వెళ్లిపోండి ఖబడ్దార్!! | Pakistan Taliban warn foreign firms to leave country amid offensive | Sakshi
Sakshi News home page

విదేశీ కంపెనీలూ.. వెళ్లిపోండి ఖబడ్దార్!!

Jun 16 2014 3:11 PM | Updated on Mar 23 2019 8:32 PM

విదేశీ కంపెనీలూ.. వెళ్లిపోండి ఖబడ్దార్!! - Sakshi

విదేశీ కంపెనీలూ.. వెళ్లిపోండి ఖబడ్దార్!!

విదేశీ కంపెనీలు వెంటనే తమ దేశాన్ని విడిచి వెళ్లిపోవాలంటూ పాకిస్థానీ తాలిబన్లు హెచ్చరించారు.

విదేశీ కంపెనీలు వెంటనే తమ దేశాన్ని విడిచి వెళ్లిపోవాలంటూ పాకిస్థానీ తాలిబన్లు హెచ్చరించారు. అఫ్ఘాన్ సరిహద్దుల వెంట ఉన్న ఈ జిల్లాలో వేలాది మంది సైనికులతో తాలిబన్లను వేటాడేందుకు చర్యలు మొదలుకావడంతో వారీ హెచ్చరికలు చేశారు. ''మొత్తం విదేశీ పెట్టుబడిదారులు, విమానయాన సంస్థలు, బహుళ జాతీయ సంస్థలు వెంటనే పాకిస్థాన్తో తమ లావాదేవీలు ఆపేసి, పాకిస్థాన్ వదిలి వెళ్లిపోవాలి. లేకపోతే వాళ్లకు ఎదురయ్యే నష్టాలకు వాళ్లే బాధ్యులవుతారు'' అని తాలిబన్ల ప్రతినిధి షహీదుల్లా షహీద్ ఓ ప్రకటనలో హెచ్చరించారు.

ఉత్తర వజీరిస్థాన్లోని ఈ గిరిజన జిల్లాలో తాలిబన్లకు చాలా గట్టి పట్టుంది. ఇక్కడ ఆదివారం రాత్రి నుంచి పాక్ సైన్యం తన ఆపరేషన్లు మొదలుపెట్టింది. కరాచీలోని ప్రధాన విమానాశ్రయంపై తాలిబన్ ఉగ్రవాదులు వరుసపెట్టి దాడులు చేసి అనేకమందిని హతమార్చడంతో పాక్ సైన్యం సుదీర్ఘ కాలం తర్వాత తొలిసారి వారిపై దాడులు మొదలుపెట్టింది. అయితే, ఈ దాడులకు తాము ప్రతీకారం తీర్చుకుంటామని తాలిబన్లు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement