ప్రత్యేక విదర్భ కోసం పాదయాత్ర | padyatra launched for separate Vidarbha statehood | Sakshi
Sakshi News home page

ప్రత్యేక విదర్భ కోసం పాదయాత్ర

Sep 28 2013 3:18 PM | Updated on Oct 8 2018 5:45 PM

మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా విభజించాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోరుతూ శనివారమిక్కడ వేలాదిమంది యువకులు పాదయాత్ర ప్రారంభించారు.

మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా విభజించాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోరుతూ శనివారమిక్కడ వేలాదిమంది యువకులు పాదయాత్ర ప్రారంభించారు. కాంగ్రెస్ నాయకుడు రంజీత్ దేశ్ముఖ్ కుమారుడు ఆశీష్ దేశ్ముఖ్ ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. ఐదు రోజుల పాటు సాగే ఈ యాత్ర మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2 వరకు సాగనుంది. ఆ రోజున గాంధీ సేవాగ్రమ్ ఆశ్రమమ్ వద్ద జరిగే కార్యక్రమంతో యాత్ర ముగియనుంది.

ఇట్వారీ ప్రాంతంలోని విదర్భ చంద్రిక ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం పాదయాత్ర మొదలైంది. పలువురు కాంగ్రెస్ నాయకులు, మాజీ ఉన్నతాధికారులు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సంఘీభావం తెలుపుతూ యాత్రలో పాల్గొన్నారు. కాగా 1953లో విదర్భను మహారాష్ట్రలో విలీనం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement