వైద్యులు గోఖలే, గోపీచంద్‌లకు పద్మశ్రీ! | Padma Shri awards to Dr. Gopal Krishna Gokhale, Dr. mannam Gopichand | Sakshi
Sakshi News home page

వైద్యులు గోఖలే, గోపీచంద్‌లకు పద్మశ్రీ!

Jan 25 2016 2:40 AM | Updated on Aug 21 2018 4:44 PM

గుంటూరు వైద్యకళాశాల పూర్వ విద్యార్థులు డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే, డాక్టర్ మన్నం గోపీచంద్‌లకు కేంద్రప్రభుత్వం 2016 సంవత్సరానికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించనున్నట్టు తెలిసింది.

గుంటూరు మెడికల్: గుంటూరు వైద్యకళాశాల పూర్వ విద్యార్థులు డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే, డాక్టర్ మన్నం గోపీచంద్‌లకు కేంద్రప్రభుత్వం 2016 సంవత్సరానికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించనున్నట్టు తెలిసింది. ఈ మేరకు డాక్టర్ గోఖలేకి సమాచారం అందింది. వీరిద్దరు కార్డియో థోరాసిక్ సర్జన్లు(సీటీఎస్) కావడం విశేషం. కృష్ణాజిల్లాకు చెందిన డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణగోఖలే గుంటూరు వైద్యకళాశాలలో 1976లో వైద్యవిద్యను అభ్యసించారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గుండెమార్పిడి ఆపరేషన్లు నిర్వహించిన మొదటి వైద్య నిపుణుడు. నవ్యాంధ్రప్రదేశ్‌లో సైతం గుండెమార్పిడి ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం సహృదయ ట్రస్టు ద్వారా జీజీహెచ్‌లో పేదరోగులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేస్తున్నారు. జీజీహెచ్‌లో 125 గుండె ఆపరేషన్లు చేసిన ఆయన త్వరలో గుండె మార్పిడి ఆపరేషన్లు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన డాక్టర్ మన్నం గోపీచంద్ 1975లో గుంటూరు వైద్య కళాశాలలో ైవె ద్యవిద్యను అభ్యసించారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని స్టార్ హాస్పిటల్‌లో గుండె వైద్యనిపుణుడిగా పనిచేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement