మరో సెల్ఫీ ఎక్స్పర్ట్‌ ఎఫ్‌ 3ప్లస్‌ లాంచ్‌ | OPPO selfie-focused F3 Plus smartphone launched in India at Rs 30,990 | Sakshi
Sakshi News home page

మరో సెల్ఫీ ఎక్స్పర్ట్‌ ఎఫ్‌ 3ప్లస్‌ లాంచ్‌

Mar 23 2017 3:36 PM | Updated on Nov 6 2018 5:26 PM

మరో సెల్ఫీ ఎక్స్పర్ట్‌ ఎఫ్‌ 3ప్లస్‌  లాంచ్‌ - Sakshi

మరో సెల్ఫీ ఎక్స్పర్ట్‌ ఎఫ్‌ 3ప్లస్‌ లాంచ్‌

చైనా మొబైల్‌ మేకర్‌ అప్పో రెండు సెల్పీ కెమెరాలతో కూడిన ఎఫ్3 ప్లస్‌ని అయిదు మార్కెట్లలో ప్రవేశపెట్టింది.

న్యూఢిల్లీ:  చైనా మొబైల్‌ మేకర్‌ అప్పో ఎఫ్3 సిరీస్‌ లో మరో  క్రేజీ స్మార్ట్‌ ఫోన్‌ లాంచ్ చేసింది. ''సెల్ఫీ ఎక్స్పర్ట్'' గా సెల్ఫీ కెమెరాలతో అదరగొడుతున్న అప్పో రెండు సెల్పీ కెమెరాలతో  కూడిన ఎఫ్3 ప్లస్‌ని అయిదు మార్కెట్లలో ప్రవేశపెట్టింది.  దీని ధరను రూ. 30.990 గానిర్ణయించింది.  ఏప్రిల్‌ 1 నుంచి దీన్ని విక్రయానికిపెట్టనుంది. ప్రీ ఆర్డర్‌ బుకింగ్‌  ఈరోజు(గురువారం) మొదలై మార్చి 31వరకు అందుబాటులో ఉండనుంది. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ మార్కెట్ రెండిటిని అందుబాటులో ఉంటుంది. ఏకకాలంలో ఐదు కీలక మార్కెట్లు భారతదేశం, ఇండోనేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, వియత్నాం లో ఎఫ్‌3 ప్లస్ ను  ప్రారంభించింది.  ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌తో పాటు,  ఫింగర్‌ ప్రింట్‌ ఆక్టివేటెడ్‌ యాప్, కాల్ షార్ట్‌ కట్స్ ను కూడా దీంట్లో జోడించింది. బాలీవుడ్‌ భామ  దీపికా పదుకొనే   కొత్త బ్రాండ్ అంబాసిడర్ గా ఈ బాలీవుడ్‌  క్రేజీఫోన్ లాంచ్‌ కావడం విశేషం.

అప్పో ఎఫ్‌ 3 ప్లస్‌ ఫీచర్లు
ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్మల్లౌ
6 అంగుళాల  ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ ప్లే
క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 652
1.96 గిగాహెడ్జ్‌ ప్రాసెసర్
4జీబీర్యామ్‌
64 జీబీ ఇంటర్నల్‌  స్టోరేజ్‌
256జీబీ  వరకు ఎక్స్‌ పాండబుల్
16ఎంపీ +8 మెగా పిక్సల్ ఫ్రంట్‌ కెమెరా విత్‌ ఫ్లాష్‌
16ఎంపీ రియర్‌ సెన్సర్‌ విత్‌ ఫ్లాష్‌
4,000 ఎంఏహెచ్ బ్యాటరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement