ఎంపీ కాకుండానే మంత్రి పదవి | Nirmala Sitharaman Profile | Sakshi
Sakshi News home page

ఎంపీ కాకుండానే మంత్రి పదవి

May 27 2014 2:03 AM | Updated on Oct 17 2018 5:55 PM

ఎంపీ కాకుండానే మంత్రి పదవి - Sakshi

ఎంపీ కాకుండానే మంత్రి పదవి

ప్రస్తుతం లోక్‌సభలో కానీ, రాజ్యసభలో కానీ సభ్యురాలు కానప్పటికీ మోడీ మంత్రివర్గంలో చోటు సంపాదించడం బీజేపీలో నిర్మలా సీతారామన్ ప్రాధాన్యతను, ప్రత్యేకతను స్పష్టం చేస్తోంది.

ప్రస్తుతం లోక్‌సభలో కానీ, రాజ్యసభలో కానీ సభ్యురాలు కానప్పటికీ మోడీ మంత్రివర్గంలో చోటు సంపాదించడం బీజేపీలో నిర్మలా సీతారామన్ ప్రాధాన్యతను, ప్రత్యేకతను స్పష్టం చేస్తోంది. 

నిర్మలా సీతారామన్ 1959 ఆగస్టు 18న తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జన్మించారు. ళీ 1980లో సీతాలక్ష్మీ రామస్వామి కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 

న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి ఎంఫిల్ (ఇంటర్నేషనల్ స్టడీస్) పట్టా పొందారు. 

*  రాష్ట్రానికి చెందిన రాజకీయ, టీవీ వ్యాఖ్యాత డాక్టర్ పరకాల ప్రభాకర్ తో వివాహం. వీరికి ఒక కుమార్తె. ప్రభాకర్ కూడా జేఎన్‌యూలోనే చదివారు. 

తొలినాళ్లలో ‘ప్రైస్ వాటర్  హౌస్ కూపర్స్’ ఆడిటింగ్ సంస్థలో సీనియర్ మేనేజర్‌గా పనిచేశారు. ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ బీబీసీలోనూ పనిచేశారు.

జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా పనిచేశారు. అత్తమామలు కాంగ్రెస్‌కు చెందినవారైనప్పటికీ బీజేపీ వైపు ఆకర్షితురాలు కావడానికి ఇది దోహదపడింది. 

2003-05 మధ్యకాలంలో సభ్యురాలిగా ఉండగా, 33% మహిళా రిజర్వేషన్ విధానానికి బీజేపీ శ్రీకారం చుట్టడం ఆమె రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పింది.

* జాతీయ కార్యవర్గంలో చేరాల్సిందిగా ఆమెను పార్టీ ఆహ్వానించింది. 2010లో పార్టీ అధికార ప్రతినిధి బాధ్యతలు స్వీకరించారు. 

* ప్రస్తుతం రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని ఆరుగురు బీజేపీ అధికార ప్రతినిధుల బృందంలో ఒకరిగా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement