'మాగ్జిమమ్ ఆరోగెన్స్, మినిమమ్ గవర్నమెంట్' | Modi's is most 'centralised' govt in India's history, Jairam Ramesh | Sakshi
Sakshi News home page

'మాగ్జిమమ్ ఆరోగెన్స్, మినిమమ్ గవర్నమెంట్'

Apr 5 2015 2:12 PM | Updated on Sep 2 2017 11:54 PM

'మాగ్జిమమ్ ఆరోగెన్స్, మినిమమ్ గవర్నమెంట్'

'మాగ్జిమమ్ ఆరోగెన్స్, మినిమమ్ గవర్నమెంట్'

ప్రధాని నరేంద్ర మోదీ ఒంటెత్తు పోకడతో పాలన సాగిస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ ఆరోపించారు.

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ ఒంటెత్తు పోకడతో పాలన సాగిస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ ఆరోపించారు. మోదీ కేంద్రబిందువుగా పాలన సాగుతోందని, ఇది చాలా ప్రమాదక ధోరణి అని ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశ చరిత్రలో ఇంతకుముందెన్నడూ లేనివిధంగా మోదీ కేంద్రీకృత పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. మోదీ నాయకత్వంలో దేశం మళ్లీ చీకటి పాలనలోకి వెళుతున్నట్టు కనబడుతోందని ఓ ఇంటర్వ్యూలో జైరాం రమేష్ అన్నారు.

10 నెలల ఎన్డీఏ ప్రభుత్వ పాలన నిరంకుశ ధోరణిలో సాగిందని దుయ్యబట్టారు. ఏకాభిప్రాయంపై మోదీకి విశ్వసం లేదని అందుకే ఆర్డినెన్స్ లు జారీ చేస్తున్నారని విమర్శించారు. మోదీ ప్రభుత్వం 'మాగ్జిమమ్ గవర్నెన్స్, మినిమమ్ గవర్నమెంట్' నినాదాన్ని 'మాగ్జిమమ్ ఆరోగెన్స్, మినిమమ్ గవర్నమెంట్'గా మార్చేసిందని ఎద్దేవా చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement