పపువా న్యూ గునియా తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది.
టరోన్: పపువా న్యూ గునియా తీర ప్రాంతంలో శనివారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 8గా నమోదైంది. సునామీ వచ్చే అవకాశముందని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం హెచ్చరించింది.
పపువాలోని టరోన్‌కు తూర్పున 46 కిలో మీటర్ల దూరంలో, 103 కిలో మీటర్ల లోతున సముద్రంలో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. పపువా న్యూ గునియా సమీప ప్రాంతాల్లో సునామీ రావచ్చని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం అప్రమత్తం చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.