పశ్చిమ తుర్కియేలో భారీ భూకంపం సంభవించింది. తీవ్రత 6.1గా నమోదైంది. రాత్రి 10:48 గంటల సమయంలో 5.99 కిలోమీటర్ల లోతులో సంభవించింది. కొన్ని భవనాలు దెబ్బతినట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతానికి ప్రాణ నష్టం గురించి ఎలాంటి సమాచారం అందలేదు. బాలికెసిర్ ప్రావిన్స్‌లోని సిందిర్గి పట్టణాన్ని భూకంపం కేంద్రంగా గుర్తించారు. ఇస్తాంబుల్, బుర్సా, మానిసా, ఇజ్మిర్ వంటి నగరాల్లో భూకంపం ప్రభావం కనిపించింది.
టర్కీ భూకంపాలకు అత్యంత ప్రభావిత దేశాలలో ఒకటి. ఇది మూడు ప్రధాన భూకంప టెక్టానిక్ ప్లేట్‌ల మధ్యలో ఉండటం వల్ల తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. 2023లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 53,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. రేపు కూడా భూకంపనలు వచ్చే అవకాశముందని ఎఫ్ఏడీ తెలిపింది. ఇప్పటి వరకు బాలికెసిర్‌లో 14 సార్లు భూమి కంపించిందని అధికారులు తెలిపారు.
6.1 magnitude earthquake strikes Turkey, about 100 miles south of Istanbul, and reduces many buildings to rubble. pic.twitter.com/clxIFxXVzl
— Mr. Lou Rage (@mrlourage) October 27, 2025


